Viveka Murder Case: వివేకానంద రెడ్డి డెత్ ఫ్యాక్టర్ జగన్ కు షాకివ్వనుందా.. పులివెందులలో భారీ మెజారిటీ కష్టమా?

Viveka Murder Case: ఇప్పటి వరకు ఓ లెక్క.. ఇప్పుడో లెక్క అన్నట్టు పులివెందుల రాజకీయం మారింది. ఇంత వరకు పులివెందులలో జగన్‌కు అడ్డేలేదు. ఇప్పుడే కాదు.. కాంగ్రెస్ హయాంలో కూడా రాజశేఖర్ రెడ్డికి ఎదురులేదు. జగన్ ఎంపీగా ఉన్న సమయంలో విజయమ్మ పోటీ చేసినపుడు కూడా భారీ మెజార్టీతో గెలిపొందారు. ఇలా వైఎస్ ఫ్యామిలీ నుంచి ఎవరు పోటీ చేసినా భారీ మెజార్టీ ఖాయమే. సీఎం అభ్యర్థి కాబట్టి ఆ మాత్రం హవా ఉంటుంది. దానికి తోడు కాంగ్రెస్ టైంలో కానీ, ఇప్పుడు కానీ స్థానికంగా వైఎస్ కుటుంబానికి ఎవరైన వ్యతిరేకంగా మాట్లాడితే అంతే సంగతి. తలకాయలు లేస్తాయ్. ఇది జగమెరిగిన సత్యం. కానీ.. ఓపెన్ సీక్రెట్. అయితే.. ఇదంతా గతం. ఇప్పుడు పరిస్థితులు మారాయి. జగన్ ఓటమి ఖాయమని చెప్పలేకపోయినా.. గెలుపు కోసం తీవ్రంగా కృషి చేయాలి అనేది నిజం.

జగన్‌కు, రాజశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా మాట వినిపిస్తే ఎవరైతే తిరగబడే వారో.. వాళ్లే ఇప్పుడు జగన్‌కు వ్యతిరేకం అయ్యారు. వైఎస్ బంధువులు, అనుచరగణం ఇప్పుడు జగన్ ను ఓడించాలని చూస్తున్నారు. దానికి కారణం వైఎస్ వివేకాహత్యకేసు. వివేకా హత్య ఎంపీ అవినాష్ రెడ్డి డైరక్షన్‌లో జరిగిందని వైఎస్ కుటుంబం, పులివెందుల ప్రజలు నమ్ముతున్నారు. అలాంటి అవినాష్ రెడ్డిని కాపాడటానికి జగన్ ప్రయత్నిస్తున్నారని కూడా ప్రజలు విశ్వసిస్తున్నారు. అందుకే, ఈసారి వైఎస్ వివేకాహత్య కేసు ప్రభావం పులివెందులలో జగన్ గెలుపుపై పడుతుందని స్థానికంగా చర్చించుకుంటున్నారు.

ఏకంగా జగన్ ను ఓడించడానికి వైఎస్ షర్మిల, వైఎస్ సునీత, వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ రంగంలో దిగారు. కడప జిల్లా రాజకీయం మొత్తం వివేకాహత్య కేసులో నిందితులకు, బాధితులకు మధ్య జరుగుతున్న యుద్దంగా మారిపోయింది. న్యాయస్థానంలో విచారణను జగన్ అడ్డుకుంటున్నారని.. అందుకే ప్రజాకోర్టులో తేల్చుకుంటామని సునీత చెబుతున్నారు. సునీతకు చివరి వరకూ అండగా ఉంటానని షర్మిల హామీ ఇచ్చారు. షర్మిల పులివెందులలో అన్నపై పోటీ చేస్తారని మొదట ప్రచారం జరిగింది. కానీ, ఆమె కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తారని అంటున్నారు. అందుకే.. సునీతా లేదా సౌభాగ్యమ్మ పులివెందుల నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. వైఎస్ షర్మిల, వైఎస్ సునీత, సౌభాగ్యమ్మకు తోడు వైఎస్ ఫ్యామిలీ, బంధువులు అంతా సునీతకు అండగా ఉన్నారు. ఇప్పుడు జగన్ తో తన అనుకున్న వాళ్లలో ఆయన భార్య, ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన మేనత్త విమలారెడ్డి మాత్రమే ఉన్నారు.

వైఎస్ వివేకా హత్యకేసులో అప్రూవర్ గా మారని దస్తగిరి కూడా జగన్ ను ఓడించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. వైసీపీ ఓటమే తన ద్యేయంగా ఆయన ప్రచారం కూడా మొదలు పెట్టారు. టీడీపీ తరుఫున బీటెక్ రవి జగన్ పై పోటీ చేస్తున్నారు. ఓ వైపు టీడీపీ, మరోవైపు వివేకా కుటుంబం, ఇంకోవైపు దస్తగిరి.. జగన్ ను అష్టదిగ్బంధనం చేస్తున్నారు. దీంతో ఆయన గెలుపు సంగతి అంటుంచితే.. ఓటమి అంచుకు వెళ్లడం ఖాయంగా తెలుస్తోంది. అంతేకాదు.. రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయాల్సిన జగన్.. పులివెందులలో ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది. దీంతో పరోక్షం రాష్ట్రవ్యాప్తంగా ఫలితాలను పులివెందుల స్థానం ప్రభావితం చేయబోతుంది.

వై నాట్ 175 అని జగన్ నినాదాలు చేస్తుంది. విపక్షాలు మాత్రం వైనాట్ పులివెందుల అని అంటున్నాయి. కష్టపడతే జగన్ ఓటమి ఖాయమని విపక్షాలు అంచనా వేస్తున్నాయి. కానీ, జగన్ అధికార బలం, డబ్బు బలం చూపించి ఏదైనా చేస్తారనే అనుమానం కూడా ఉంది. దీంతో, జగన్ ఓటమి సంగతి అటుంచితే.. మెజార్టీ మాత్రం పడిపోవడం ఖాయంగా తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -