AP Politics: బటన్ నొక్కితే చాలు.. సొమ్ములు పడకపోయినా పర్లేదు.. వైసీపీ లెక్కలు ఇవేనా?

AP Politics: పురాణాల్లో బలరాముడి కుమార్తె శశిరేఖ అర్జునుడి కొడుకు అభిమన్యుడిని ఇష్టపడుతుంది. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటుంది. అయితే, అది బలరాముడికి ఇష్టం ఉండదు. అప్పుడు ఘటోత్కచుడు బలరాముడికి ఇంటికి వచ్చి శశిరేఖ వేషంలో తిరుగుతాడు. శశిరేఖను ఎవరికీ తెలియకుండా అభిమన్యుడి దగ్గరకు పంపిస్తాడు. మాయలు తెలిసిన ఘటోత్కచుడు ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు చూపిస్తూ అందరిని మాయ చేస్తాడు. ఈ తతంగం మొత్తానికి శ్రీ కృష్ణుడి సాయం కూడా ఉంటుంది కనుక అన్ని సవ్యంగా జరిపోతాయి. మాయాబజార్ సినిమాలో మనం దీన్ని చూశాం.

ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపించడంలో వైసీపీ నేతలు ఘటోత్కచుడిని మించిపోతున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశామని సీఎం జగన్ ప్రతీ సభలోనూ ఊదరగొడుతున్నారు. బటన్ల నొక్కుతున్న జగన్ ప్రసంగాలను చూసివారికి ఎవరికైనా 100కి వంద శాతం హామీలు పూర్తి చేసి ఉంటారు.. కానీ ఎక్కడో పొరపాటున జగన్ 99 శాతం అని అంటున్నారని అనుకుంటారు. అంతగా ఆ ప్రచారాన్ని రక్తి కట్టిస్తున్నారు. కానీ, గత ఎన్నికల్లో వైసీపీ ఇచ్చిన హామీలేంటీ అని ఓసారి పరిశీలిస్తే జగన్ నొక్కిన బటన్లు ఎన్ని? నొక్కాల్సిన బటన్లు ఎన్ని? నొక్కినా పనిచేయని బటన్లు ఎన్ని అని తేలిపోతుంది?

99శాతం అమలు చేశామని చెబుతున్న వైసీపీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 10 శాతం కూడా పూర్తి చేయలేదు. గత ఎన్నికల ముందు రైతు భరోసా కింద 12 వేలు ఇస్తామని చెప్పారు. కానీ, కేంద్రం ఇస్తున్న 5 వేలును కలిపి 12 వేలు ఇస్తున్నారు. ఇలా రైతు భరోసా కింద 12 హామీలు ఇచ్చారు. ఇక వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద 8 హామీలు ఇచ్చారు. పింఛన్లు పెంపుపై 3 హామీలు ఇచ్చారు. ఈ అన్నింటిలో పింఛన్లు విషయంలో ఒక హామీ నెరవేరింది. ఇలా జగన్ మాటలకు చేతలకు పొంతన లేదు. అంతవరకూ ఎందుకు? విభజన హామీల విషయంలో ఎలాగూ కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం చేయలేదు. కనీసం కేంద్రం సాయం లేకుండా అమలు చేసే హామీలను కూడా గాలికొదిలేశారు. నిరుద్యోగులకు మెగా డీఎస్సీ అన్నారు. ఎన్నికలకు ముందు హడావిడిగా ఓ నోటిఫికేషన్ ఇచ్చారు. నోటిఫికేషన్ మొత్తం తప్పులు తడకులు ఉండటంతో అందులో హైకోర్టు కూడా కలగజేసుకోవాల్సి వచ్చింది. ఇక, ప్రతీ ఏడాలి 6,500 పోలీస్ ఉద్యోగాలన్నారు. క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. ప్రతీ జనవరిలో నోటిఫికేషన్ ఉంటుందని అన్నారు. ఐదేళ్లు పూర్తి అవుతుంటే ఓ సారి విడుదల చేశారు. కానిస్టేబుల్ నోటిఫికేషన్ పై కోర్టు కేసు పడటంతో ప్రిలిమినరీ పరీక్ష జరిగిన తర్వాత ఆ నోటిఫికేషన్ అతీగతీ లేకుండా అయిపోయింది. ఉద్యోగులకు సీపీఎస్ రద్దు అని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చేతులెత్తేశారు. సంపూర్ణ మద్యపాన నిషేదమని మహిళలను నమ్మించారు. మద్యం లేకపోతే ప్రభుత్వాన్ని నడిపించే పరిస్తితి లేనట్టు తయారు చేశారు. మరి 99 శాతం హామీలు ఎక్కడ నెరవేరాయి? వైసీపీ నేతలే చెప్పాలి.

నేను బటన్ నొక్కితే లంచాలకు ఆస్కారం లేకుండా నేరుగా లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాల్లోకి వెళ్లిపోతున్నాయని జగన్ చెబుతున్నారు. మరి నిజంగానే అదంతా జరుగుతుందా? అంటే అది కూడా లేదు. రీసెంట్ గా అనకాపల్లిలో చేయూత పథకం లబ్ధిదారుల కోసం బటన్ నొక్కి అకౌంట్స్ లో డబ్బులు పడిపోతాయని జగన్ చెప్పారు. ఇది జరిగి వారం గడుస్తున్నా.. డబ్బులు రాలేదు. కనీసం బ్యాంక్ నుంచి మెసెజ్ కూడా రాలేదు. డబ్బులు ఖాతాల్లో పడవని తెలిసే.. జగన్ ముందే చెప్పారు. తప్పుడు వార్తలు రాసే వారిని నమ్మొద్దని అన్నారు. డబ్బులు పడినా కూడా పడలేదని ఎవరూ వార్తలు రాయరు. నిజంగానే డబ్బులు పడిన తర్వాత కూడా పడలేదని వార్తలు రాస్తే.. పరువు నష్టం కింద అలా రాసిన వారిపై చర్యలు తీసుకోవచ్చు. కానీ, అలాంటి వార్తలను చూడొద్దని ప్రజలకు ఎందుకు బ్రతిమలాడాలి? నిజానికి చేయూత పథకం కింద డబ్బు పంపిణీ జరగాలంటే.. ఆర్ధిక శాఖ నిధులు మంజూరు చేస్తూ ఓ ఆర్డర్ విడుదల చేయాలి. అప్పుడు బటన్ నొక్కితే డబ్బులు లబ్ధిదారుల ఖాతాల్లో పడతాయి. కానీ, ఆర్థికశాఖ నుంచి అలాంటి ఆర్డర్స్ ఏమీ రాలేదు. కానీ, జగన్ పని చేయని బటన్ నొక్కేశారు. అందుకే, డబ్బులు ఎవరి ఖాతాలోనూ పడలేదు. పార్టీ నేతలను ప్రశ్నిస్తే.. బటన్ నొక్కారు. కదా? డబ్బులు వస్తే ఏంటీ? రాకపోతే ఏంటీ అని తిరిగి ప్రశ్నిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -