YSR: వైఎస్సార్ గురించి బాలయ్య కామెంట్లు విన్నారా?

YSR: నటుడిగా వెండి తెర మీద ఓ వెలుగుతున్న నందమూరి బాలయ్య.. ఓటీటీ వేదికగా టాక్ షో ద్వారా అందరినీ ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ‘అన్ స్టాపబుల్’ పేరుతో బాలయ్య చేస్తున్న టాక్ షో భారీ హిట్ కాగా.. దానికి కొనసాగింపుగా ‘అన్ స్టాపబుల్2’ పేరుతో కొత్త సీజన్ ను ప్రారంభించడం తెలిసిందే. కాగా తాజాగా ఈ ఎపిసోడ్ కు వచ్చిన గెస్టులతో బాలయ్య చర్చించిన అంశాలు ట్రెండ్ అవుతున్నాయి.

 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పొలిటికల్ గా తనదైన ముద్రను వేసుకున్న నేత దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి గురించి బాలయ్య తన టాక్ షోలో ప్రస్తావించారు. బాలయ్య చేస్తున్న ‘అన్ స్టాపబుల్2’ నాలుగో ఎపిసోడ్ కి గెస్టులుగా బాలయ్య మిత్రులు కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ రెడ్డిలు విచ్చేశారు. ఉమ్మడి ఏపీ మాజీ సీఎంగా వ్యవహరించిన కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ అసెంబ్లీ స్పీకర్ సురేష్ రెడ్డిలు బాలయ్యతో కలిసి హైదరాబాద్ లోని నిజాం కాలేజీలో చదువుకున్నారు.

 

ఇక ఈ ఎపిసోడ్ లో ఏపీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో బాలయ్య మాట్లాడుతూ.. వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జరిగిన పరిణామాలు, కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయిన విధానం గురించి ప్రస్తావించాడు. ఈక్రమంలోనే కిరణ్ కుమార్ రెడ్డి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అప్పుడు ఏం జరిగిందనే విషయాన్ని ఆయన వివరించారు.

 

బాలయ్య అడిగిన ప్రశ్నకు కిరణ్ కుమార్ రెడ్డి సమాధానమిస్తూ.. ‘ఒక సీనియర్ మినిస్టర్ ఉండేవారు.. రాజశేఖర్ రెడ్డి గారిని మిస్ లీడ్ చేసేవారు’ అంటూ చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోను కొత్త ప్రోమోలో చూపించగా.. ‘నేను బతికి ఉన్నాను కాబట్టి సీఎం అయ్యాను’ అంటూ ఆసక్తికర కామెంట్ చేశారు. అలాగే వైయస్ రాజశేఖర్ రెడ్డి హెలీకాప్టర్ ప్రమాదం గురించి కూడా కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తావించారు.

 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి గురించి కూడా ప్రస్తావించారు. ఆయన గొప్పతనాన్ని వివరిస్తూ బాలయ్య కూడా ఎమోషనల్‌ అయ్యారు. మనం గొప్ప నేతలను, వ్యక్తులను కోల్పోయామని, అలాంటివారిలో రాజశేఖర్ రెడ్డి ఒకరని ఆయనపై బాలయ్య తన మనసులో ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్నా కానీ వైయస్ రాజశేఖర్ రెడ్డి పట్ల బాలయ్యకు ఉన్న సదభిప్రాయానికి అందరూ ఫిదా అవుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -