Jr NTR: టీడీపీ నుండి ఎన్టీఆర్ ను దూరం చేయటానికి వైసీపీ నిజంగా ప్రయత్నిస్తుందా?

Jr NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీకి జూనియర్ ఎన్టీఆర్ పేరును పెద్దగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. కొన్ని నెలల క్రితం ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఆ సినిమాలో తన విశ్వరూపం ని చూపించాడు. ఇక ఇదంతా పక్కన పెడితే ఈ మధ్య కొన్ని రాజకీయ పార్టీలు జూనియర్ ఎన్టీఆర్ ఇమేజ్ ను ఉపయోగించుకోవాలని చూస్తున్నాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నాడని కూడా గత కొన్ని రోజులుగా పుకార్లు వినిపిస్తున్నాయి.

ఇందులో భాగంగా ఎన్టీఆర్ ను సైతం వైసీపీ లైన్ లో పెట్టిందంటూ సోషల్ మీడియా లో వార్తలు వస్తున్నాయి. 2023 ఆస్కార్ అవార్డ్‌కు ఎంపికయ్యే సినిమాల జాబితాలో ఆర్ఆర్ఆర్ కూడా ఉందని తెలిపింది. సోషల్ మీడియాలో ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. ఎన్టీఆర్ లేదా రామ్‌చరణ్‌లల్లో ఒకరు ఈ ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డ్‌ను అందుకోవడం ఖాయమని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు

మూడు కేటగిరీల్లో ఈ సినిమా ఎంపికైందని తెలిపింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ (దోస్తీ), బెస్ట్ యాక్టర్ (రామ్‌చరణ్-జూనియర్ ఎన్టీఆర్), బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీల కోసం ఆస్కార్ నిర్వాహకులు ఆర్ఆర్ఆర్ మూవీని ఎంపిక చేసినట్లు తెలిసింది. ఈ విషయం తెలిసిన వెంటనే రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆనందంతో సంబరాలు చేసుకుంటూ సోషల్ మీడియాలో తమ అభిమాన హీరో ఫోటోలను షేర్ చేస్తున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తున్నాడా..

తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వీ విజయసాయి రెడ్డి కూడా స్పందించి.. ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్ అవార్డు కోసం ఎంపికైనట్లు కొన్ని హాలీవుడ్ మేగజైన్లలో చూశానని తెలిపారు. ఈ సినిమా హాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుందని అన్నారు. ఆస్కార్ బరిలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఉండొచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఆ పార్టీ కీలక నేతలు సైతం జూనియర్ ఎన్టీఆర్ ను దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ ను టీడీపీ దూరం చేయాలని వైసీపీ ప్లాన్ అని కూడా పుకార్లు వినిపిస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -