YSRCP: జగన్ సభకు సగం నేతలు డుమ్మా.. వాళ్లను అవమానించడం వల్లే ఇలాంటి పరిస్థితా?

YSRCP: సిద్ధం పేరుతో జగన్ పెట్టిన సభలకు జనం తొండోప తండాలుగా వస్తున్నారు. ప్రజలు జగన్ సభల్లో జనసంద్రంలా మారుతున్నారని వైసీపీ నేతలు, వైసీపీ సోషల్ మీడియా ఊదరగొడుతోంది. అయితే, అసలు విషయం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిపారు. ఈ సభకు ప్రజలు, కార్యకర్తలు మాట అటుంచితే పార్టీ లీడర్లే రాలేదు. తమ బలాన్ని చూపించుకోవడానికి జగన్ చాలా పెద్ద స్టేజ్ వేస్తారు. కానీ, ఆ స్టేజ్ ఖాళీగా ఉండటంతో.. ప్రకాశం జిల్లా వైసీపీ ఖాళీ అయిపోయిందా అన్న సెటైర్లు పడుతున్నాయి. జగన్ పై వైసీపీ నేతలకు పూర్తిగా నమ్మకం పోయింది. నువ్వే మా నమ్మకం జగనన్న అని ప్రజలను నమ్మించాలని స్టిక్కర్లు అంటిస్తున్నా.. ముందు సొంత పార్టీ నాయకులకే నమ్మకం కలగడం లేదు.

నిజానికి ప్రభుత్వ కార్యక్రమానికి కొన్ని ప్రొటోకాల్స్ ఉంటాయి. కొందరికే ప్రభుత్వం తరఫున ఆహ్వానం అందుతుంది. స్థానిక ప్రజాప్రతినిధులకు.. అక్కడున్న గెలిచిన వారు విపక్ష ప్రజాప్రతినిధులు అయినా వారికి ఆహ్వానం ఇవ్వాలి. అయితే, ఆ సాంప్రదాయాలను జగన్ తుంగలో తొక్కి సొంత పార్టీ కార్యక్రమంలా పార్టీ జెండాలు ఏర్పాటు చేసిన నిర్వహిస్తారు. అయితే, ఈ పట్టాపంపిణీ కార్యక్రమానికి సొంతపార్టీ నేతలు కూడా హాజరుకాలేదు. సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి ఏ రకంగా చూసినా ఆహ్వానం అందాలి. అది పార్టీ పరంగా అయినా అందాలి. లేదంటే.. స్థానిక ఎంపీగా అయినా ఆహ్వానించాల్సిందే. అయితే, ఆయనకు ఆహ్వానం అందలేదు. దీంతో.. ఆయన ఈ సభకు హాజరుకాలేదు. రాజకీయంగా ఆయన్ని చాలా రోజుల నుంచి దూరం పెడుతూ వచ్చారు. టికెట్ ఇచ్చేది లేదని డైరెక్ట్ గా చెప్పకుండా పలు అవమానాలకు గురి చేశారు.

దీంతో.. ఆయన తన కుమారుడి రాజకీయ భవిష్యత్ కోసం పక్క చూపులు చూస్తున్నారు. ఇక ఎమ్మెల్యేలు మద్దిశెట్టి వేణగోపాల్, మానుగుంట మహీధర్ కూడా హాజరుకాలేదు. వారికి కూడా టికెట్ ఇస్తామని ఆశ చూపించి తర్వాత మొండి చేయి చూపించారు. అంతేకాదు ప్రత్యామ్నం కూడా చూపించలేదు. దీంతో.. వైసీపీలో రాజకీయ భవిష్యత్ ఉండదని భావించిన వేణుగోపాల్, మానుగుంట కూడా గత కొన్నాళ్లుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇక మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు, మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు కూడా పట్టాల పంపిణీ కార్యక్రమానికి హాజరుకాలేదు. గత ఎన్నికల తర్వత బెదిరించి పార్టీలో చేర్చుకున్నారు. ఈ ఎన్నికల వచ్చేసరికి వారికి హ్యాండ్ ఇచ్చారు. టికెట్లు కేటాయింపులో రేసులో వీరిద్దరూ ఉన్నారనే విషయాన్ని కూడా సీఎం వైఎస్ జగన్ పట్టించుకోలేదు.

వీరంతా జగన్ ను నమ్ముకొని వారి రాజకీయ భవిష్యత్‌ను ప్రమాదంలో నెట్టుకున్నారు. ఇప్పుడు ఎటు పోవాలో దిక్కుతోచన అయోమయ స్థితిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో ముందు జగన్‌ను ఓడిస్తే. తర్వాత ఏదో ఒక దారి దొకకపోతుందా? అని అనుకుంటున్నారు. గట్టిగా కొడితే జగన్ ఇంత వరకూ 70 స్థానాలు కూడా ప్రకటించలేదు. ఇప్పుడే ఇంత అసంతృప్తి జ్వాలలు రగులుతుంటే.. ముందుముందు ఇంకెంతగా ఉంటాయో అని జగన్ టీం ఆందోళనలో ఉంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -