YSRCP-TDP: వైసీపీ నుంచి టీడీపీలోకి వలసల జోరు.. ఎన్నికలకు ముందే ఓటమి ఖాయమైందా?

YSRCP-TDP: ఎన్నికల ముందు జరుగుతున్న పరిణామాలు ఆ ఎన్నికల ఫలితాలను అంచనా వేయడానికి దోహద పడతాయి. ఎందుకంటే.. ఎన్నికలకు 3 నెలల ముందు నుంచి పొలిటికల్ వింగ్ ఎటు ఉంటే.. అటువైపు రాజకీయ నాయకులు జంప్ చేస్తూ ఉంటారు. ఇక ఏపీలో అయితే.. ఆరు నెలల ముందు నుంచే ఓ అంచనా వేయొచ్చు. ఎందుకంటే.. ఏపీలో రాజకీయాలు చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంటాయి. ఏపీలో ఓటు హక్కు వచ్చిన ప్రతీ ఒక్కరూ రాజకీయాలను నిశితంగా గమనిస్తారు. అందుకే ఎన్నికల ముందే కాకుండా ఐదేళ్ల పాటూ ఏపీలో ఎన్నికల వాతావరణమే ఉంటుంది. దీంతో.. ఎన్నికలకు ముందు రాజకీయ వాతావరణాన్ని బట్టి ఫలితాలను ఓ అంచనా వేయొచ్చు.

ఏ పార్టీలోకి ఎక్కువగా వలసలు ఉంటే.. ఆ పార్టీకి గెలుపు అవకాశాలు ఉంటాయి. ఇటీవల తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో మూడు నెలల ముందు నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్‌లోకి చేరికలు జరిగాయి. ఎమ్మెల్యే, ఎంపీ స్థాయిలో వేళ్లపై లెక్కపెట్టేలా చేరికలు ఉన్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం పెద్ద ఎత్తున కాంగ్రెస్ గూటికి చేరారు. మూడు నెలల పాటు.. ఏదో ఒక ప్రాంతంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో.. ఆ ఫలితాలు ఎలా వచ్చాయో అందరం చూశాం. ఇప్పుడు ఏపీలో కూడా అదే స్థాయిలో టీడీపీలోకి చేరికలు పెరుగుతున్నాయి. ఏపీకి, తెలంగాణకు రాజకీయ పరిస్థితులు వేరుగా ఉంటాయి కనుక.. తెలంగాణలో కాంగ్రెస్ గెలిచిందని.. చేరికలతో ఏపీలో టీడీపీ గెలుస్తుందని చెప్పలేమనే వాదన కూడా ఉంది.

కానీ, గత ఎన్నికలకు ముందు ఏపీలో వైసీపీలోకి ఇదే స్థాయిలో చేరికలు జరిగాయి. లోటస్ పాండ్‌లో ఎమ్మెల్యే, ఎంపీ స్థాయిలో చేరికలు జరిగితే.. జిల్లాల్లో ఎంపీపీలు, ఎంపీటీసీలు పెద్ద ఎత్తున వైసీపీ గూటికి చేరారు. అప్పుడు ఫలితం ఎలా ఉందో చూశాం. ఇప్పుడు పరిస్థితి సేమ్ కనిపిస్తోంది. కాకపోతే.. అప్పుడు వైసీపీలో చేరికలు ఉంటే.. ఇప్పుడు టీడీపీలో చేరికల పర్వం నడుస్తోంది. వైసీపీ టికెట్ల ప్రకటించక ముందు నుంచే ఒక్కక్కొరు ఆ పార్టీని వీడటం మొదలు పెట్టారు. టికెట్లు ప్రకటించిన తర్వాత మరింత మంది టీడీపీ, జనసేన వైపు క్యూ కడుతున్నారు.

అయితే లెక్కబెట్టలేనంత మంది వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కండువాలు మార్చుకుంటున్నారు. ఇక.. మండల, గ్రామస్థాయి నేతలు సంగతి ఇక చెప్పాల్సిన పని లేదు. దీంతో.. టీడీపీ వైపే గాలి వీస్తుందని చెప్పొచ్చు. పార్టీలు మారుతున్న వారు కూడా ఊరికే కండువాలు మార్చరు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఎవరికి అనుకూలంగా ఉన్నాయో లెక్కలు వేసుకొని మరో పార్టీలో చేరుతారు. అయితే, వారు చేరిన తర్వాత అయోమయంలో ఉన్న వాటర్లకు ఎవరికి ఓటు వేయాలో మరింత క్లారిటీ వస్తుంది. ఈ చేరికల పర్వం టీడీపీలో ఇంకా కొనసాగుతోంది.

తాజాగా పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి, విజయవాడ నగర వైసీపీ అధ్యక్షుడు భవకుమార్, కమ్మ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తుమ్మర రాజశేఖర్ వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. వీరందరికీ నారాలోకేష్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చంద్రబాబుతోనే రాష్ట్ర భవిష్యత్ సాధ్యమని తాము నమ్ముతున్నట్టు వారు తెలిపారు. పార్థసారథితో పాటు నియోజకవర్గంలో కీలక నేతలు టీడీపీ గూటికి చేరారు. పార్థసారధికి నూజివీడు టికెట్‌ను చంద్రబాబు కన్ఫామ్ చేశారు. దీంతో.. నూజివీడుతో పాటు.. పెనమలూరును కూడా గెలిపించుకునే బాధ్యత తమదేనని పార్ధసారధి వర్గం చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -