Narayanaswamy: వైసీపీలో నాపై కుట్ర.. డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు

Narayanaswamy: ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ అయిన వైసీపీలోనే తనపై కుట్ర జరుగుతోందంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. పార్టీలోని ఓ కీలక వ్యక్తి తనకు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు. పార్టలోని ఓ వ్యక్తి తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని, తాను అవినీతి చేశానని నిరూపిస్తే కాళ్లు పట్టుకుని క్షమాపణ చెబుతానంటూ సవాల్ విసిరారు. తాను ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్నాననే విషయం గుర్తు పెట్టుకుని మాట్లాడితే మంచిదని అన్నారు.

తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్న వ్యక్తి గురించి తాను చెబితే ఏమవుతుందో ఆలోచించి మాట్లాడితే మంచిదని నారాయణ స్వామి హెచ్చరించారు. తనపై అవినీతి ఆరోపణలు చేస్తున్న వ్యక్తి వివరాలను కూడా నారాయణస్వామి బయటపెట్టాడు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని ఓ మండలానికి చెందిన వ్యక్తి అని బయటపెట్టాడు. ఆయన తనపై కుట్ర చేస్తున్నారంటూ ఆరోపించారు. తాను పార్టీ కోసం కూలివాడిగా పనిచేస్తున్నానని, తనపై ఆరోపణల చేయడం తగదని వార్నింగ్ ఇచ్చారు. కాదంటే తాను ఏం చేస్తానో చూపిస్తానంటూ హెచ్చరికలు జారీ చేశారు.

తనపై చేసిన అవినీతి ఆరోపణలు తప్పు అని తేలితే తనపై పార్టీతో వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్లు బయటకు పోవాలని నారాయణస్వామి సూచించారు. తనను అవమానించిన విషయం చెబితే ఏమవుతుందో ప్రభుత్వంలో ముఖ్య హోదాలో ఉన్న ఆ నేతలకు తెలియడం లేదంటూ తెలిపారు. నారాయణస్వామి వ్యాఖ్యలో వైసీపీలో కలకలం రేపుతున్నాయి. సొంత పార్టీలోనే ఆయపై కుట్ర చేస్తూ వ్యతిరేకంగా పనిచేసే ఆ ముఖ్య నేత ఎవరనే దానిపై వైసీపీ వర్గాలు జోరుగా చర్చించుకుంటున్నాయి. మంత్రికి వ్యతిరేకంగానే రాజకీయాలు చేస్తారా అంటూ నారాయణస్వామి అనుచరులు మండిపడుతున్నారు. నారాయణస్వామికి వ్యతిరేకంగా రాజకీయాలు చేసేత ఎవరినైనా వదిలిపెట్టని ఆయన అనుచరులు వ్యాఖ్యానిస్తున్నారు. వారి ఎవరో తమకు తెలుసని, త్వరలో తగిన బుద్ది చెబుతామని అంటున్నారు. ఇంతకు ఆ నేతలో ఎవరనే దానిపై అనేక చర్చలు జరుగుతు్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -