Janasena: జనసేనలో జోష్.. వైసీపీ నుంచి భారీగా చేరికలు

Janasena: ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర మాత్రమే సమయం ఉండటంతో రాజకీయ వేడి మరింత పెరిగింది. పార్టీలన్నీ ఇప్పటినుంచే ఎన్నికలకు సిద్దమవుతున్నాయి. గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించిన వైసీపీ.. రెండోసారి కూడా అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇఫ్పటినుంచే సీఎం వైఎస్ జగన్ ఎన్నికలపై దృష్టి పెట్టారు. అభ్యర్థుల ఎంపికపై ఇప్పుటినుంచే దూకుడు పెంచారు. నియోజకవర్గాల వారీగా ఫీడ్ బ్యాక్ తెప్పించుకుంటూ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేశారు.

ఇక అటు టీడీపీ కూడా స్పీడ్ పెంచింది. గత ఎన్నికల్లో ఘోర పరాజయం మూటకట్టుకోవవడంతో ఈ సారైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. అందుకే చంద్రబాబు ఇప్పటినుంచే అభ్యర్థల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టారు. ప్రతిసారి నామినేషన్ కు ముందు రోజు చంద్రబాబు అభ్యర్థులను ప్రకటిస్తారు. కానీ ఈ సారి ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందుగానే అభ్యర్థులను ఖరారు చేయాలని భావిస్తున్నారు. అందుకే నియోజవకర్గాల వారీగా రిపోర్టులు తెప్పించుకుంటూ నేతలతో సమావేశం అవుతున్నారు. అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకతను తమవైపు మలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇక జనసేన కూడా దూకుడు పెంచింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎప్పుడూ ఏదోక కార్యక్రమంలో ప్రజల్లోనే తిరుగుతున్నారు. గత ఎన్నికలతో పొలిస్తే ఏపీలో జనసేన బలం బాగా పుంజుకుంటుందనే అంచనాలు వస్తున్నాయి. దీంతో జగన్ ను ఎదుర్కొవడంపై పవన్ దృష్టి పెట్టారు. అయితే వైసీపీని జనసేనలోకి వలసలు పెరగడం ఇఫ్పుడు ఏపీ పాలిటిక్స్ లో చర్చనీయాంశంగా మారింది. గుడివాడలో కొడాలి నాని సన్నిహితులుగా ఉన్న పాలంకి బ్రదర్స్ జనసేనలో చేరారు. వచ్చే ఎన్నికల్లో కొడాలి నానిపై పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారు.

ఇక రాజోలు నియోజకవర్గం నుంచి గత రెండు ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన బొంతు రాజేశ్వరరావు జనసేనలో చేరేందుకు సిద్దమవయ్యారు. ఇటీవలే పవన్ ను ఆయన కలిసి జనసేనలో చేరేందుకు ఆసక్తి కనబరిసినట్లు చెబుతున్నారు. ఇక ఇటీవల తెనాలిలో వైసీపీకి చెందిన కీలక నేత శివరామిరెడ్డి జనసేనలో చేరారు. పవన్ ఆయనకు స్వయంగా కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. ఇక వైసీపీ, టీడీపీ పొత్తు ఉంటే వైసీపీకి చెందని చాలామంది నేతలు జనసేనలో చేరే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాల్లో జంపింగ్ లు ఎలా ఉంటాయో..

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -