CM Jagan Stone Attack Case: గులకరాయి కేసులో ఏ2 ఎవరు జగన్ సార్.. ఆ నేతలను ఇరికించే కుట్ర జరుగుతోందా?

CM Jagan Stone Attack Case: సీఎం జగన్మోహన్ రెడ్డి పై జరిగినటువంటి రాయి దాడి ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఘటనలో భాగంగా వడ్డెర్ల సతీష్ అలియాస్ సత్తి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా సతీష్ అరెస్టు కావడంతో పోలీసులు పూర్తిస్థాయి రిమాండ్ రిపోర్ట్ ఇవ్వకపోగా అరకొర రిపోర్ట్ ఇస్తూ తనని రిమాండ్ కి పంపించారు.

సీఎం పై జరిగిన రాయి దాడి కేసులో మొదటి నుంచి కూడా ఎన్నో అనుమానాలు ఉన్నాయి. పోలీసులు కూడా సరైన స్థాయిలో దర్యాప్తు చేయకుండా పలువురుని అనుమానిస్తూ వారిలో సతీష్ అనే వ్యక్తి దాడి చేశారని నిర్ధారించి తనని రిమాండ్ కి తరలించారు. సతీష్ ను A1 ముద్దాయిగా చిత్రీకరించారు.

ఇక ఈయనని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా A 2 ప్రోద్భలంతోనే తాను ఈ దాడి చేశానని చెబుతున్నారు. అయితే ఆ A 2 ఎవరు అనేది ఇప్పటివరకు పోలీసులు తేల్చలేకపోతున్నారు. మరి ఆ A 2 ఎవరు అనేది తెలియాల్సి ఉంది. అయితే రిమాండ్ రిపోర్టులో భాగంగా A 2 చెప్పిన విధంగానే జగన్ పై రాయి తీసుకురానని తెలియజేశారు. కానీ ఇప్పటివరకు కనుగొనలేదు కేవలం ఇదంతా కూడా స్థానిక టిడిపి నాయకులను ఇరికించడం కోసమే కుట్ర చేశారని తెలుస్తోంది.

ఇక ఈ ఘటనలో సతీష్ పై కూడా కేసు నమోదు చేయడానికి బస్సుకు ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఫుటేజీ సెల్ టవర్ డంప్ విశ్లేషణ సీడీఆర్ ద్వారా నిందితులను గుర్తించి అరెస్టు చేసామని పోలీసులు తెలిపారు. అతనికి సీఎం జగన్ పై జరిగినటువంటి గులకరాయి దాడి ఘటన అందరిలోనూ ఎన్నో అనుమానాలకు కారణం అవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -