పెనమలూరులో బాబాయ్ Vs అబ్బాయి !?

ఉమ్మడి కృష్ణ జిల్లాలో తెలుగుదేశం రాజకీయం నూతనుత్సాహంతో ఉరకలు తీస్తుంది .. పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు సొంత జిల్లా అయిన కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ అనుకున్న రీతిలో ప్రభావం చూపించలేకపోతుంది ..

ఇదే విషయంపై జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు , జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జిల్లా రాజకీయాలపై ప్రత్యేక ద్రుష్టి సారించారు ..

ప్రజల నుండి కార్యకర్తల నుండి అభిప్రాయం తీసుకున్నాక అజాత శత్రువు మాజీ హోమ్ మంత్రి వసంత నాగేశ్వరరావు కుమారుడు ప్రస్తుత మైలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ని కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ..

దీనితో మైలవరం ఇంచార్జి గా ఉన్న మాజీ మంత్రి దేవినేని ఉమా పెనమలూరు వెళ్తారని తెలుగుదేశం వర్గాలు గుసగుస లాడుకుంటున్నారు..

ఇది ఇలా ఉండగా సంచలనం రేపుతూ దేవినేని ఉమా అభ్యర్థిత్వాన్ని వెనక్కి నెడుతూ దేవినేని కుటుంబం నుండి మరో యువ నేత దేవినేని చంద్రశేఖర్ పేరు తెరపైకి వచ్చింది..

కుటుంబనేపథ్యం , ఆర్ధిక భలం , యువకుడు, వివాదరహితుడు , అంతే కాకుండా దశాబ్ద కాలంగా కుటుంబంలో దేవినేని అవినాష్ లాంటి వాళ్ళు పార్టీలో టికెట్ తీసుకుని అవసరాల కోసం పార్టీ మారిన దేవినేని చంద్రశేఖర్ (చందు) నారా లోకేష్ కి అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నారు..

దీనితో పెనమలూరు బరిలోకి దేవినేని చంద్రశేఖర్ పేరుతో పార్టీ సర్వే నిర్వహిస్తున్నట్లు సమాచారం .. యువగళం పాదయాత్రలో కీలకంగా వ్యవహరించడం , పార్టీకి ముఖ్యంగా యువనేత నారా లోకేష్ కి విధేయుడిగా ఉండటం చంద్రశేఖర్ కి కలిసి వచ్చే అంశాలుగా చెప్పుకోవచ్చు ..

రాబోయే 30 ఏళ్ళ సమీకరణలని దృష్టిలో పెట్టుకుని యువతకి 40% టికెట్లు కేటాయించాలని భావిస్తుంది తెలుగుదేశం పార్టీ.. ఈ కోటాలో టికెట్ సాధించే విధంగా పావులు కదుపుతున్నారు యువనేత చంద్రశేఖర్ ..

వసంత కృష్ణప్రసాద్ పార్టీలో చేరిన నాడే దేవినేని చంద్రశేఖర్ కూడా హైదరాబాద్ లో నారా చంద్రబాబు నాయుడు గారితో , నారా లోకేష్ గారితో భేటీ అవ్వడం ఆశక్తి కలిగిస్తుంది ..

ఇది ఇలా ఉండగా మైలవరంపై ఆఖరి క్షణం వరకు ఆశలు పెట్టుకున్న మాజీ మంత్రి దేవినేని ఉమాకి వసంత రాకతో భంగపాటు ఎదురయిందనే చెప్పాలి ..

ఈ సారి ఎన్నికలకి కొంత మంది సీనియర్లని పార్టీ వ్యవహారాలు ఉపయోగించుకుని కొన్ని జిల్లాల బాధ్యతలు అప్పజెప్పి ప్రభుత్వం ఏర్పడిన తరువాత సముచిత స్థానం కలిపించాలని తెలుగుదేశం అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం..

పెనమలూరు వైపు మాజీ మంత్రి చూస్తుండగా దేవినేని చంద్రశేఖర్ పేరు తేర పైకి రావడంతో పెనమలూరు బరిలోకి బాబాయ్ దిగుతాడా అబ్బాయి దిగుతాడా అంటూ తెలుగుదేశం శ్రేణులు , ప్రజలు ఆశక్తికరంగా వేచి చూస్తున్నారు ..

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -