YSRCP Rebel MLAs: వైసీపీ జంపింగుల విషయంలో టీడీపీ ఆచితూచి అడుగులు వేసిందా.. వాళ్లకు భారీ షాకిచ్చిందిగా!

YSRCP Rebel MLAs:  జగన్ నెలన్నర ముందు నుంచి టికెట్లు కేటాయింపు.. అభ్యర్థుల జాబితాలు విడుదల చేయడం మొదలు పెట్టారు. కానీ.. చంద్రబాబు మాత్రం తీవ్రంగా కసరత్తు చేసి ఒకేసారి 94 మందితో తొలి జాబితా విడుదల చేశారు. అయితే, అభ్యర్థులను ప్రకటన విషయంలో ఆచీతూచీ అడుగులు వేసినట్టు తెలుస్తోంది. చంద్రబాబు చెప్పినట్టు కోటి మందికి పైగా కార్యకర్తలు, ఓటర్ల అభిప్రాయాలు సేకరించి ఈ జాబితా విడుదల చేశామని అన్నారు. ప్రకటించిన వారంతా గెలుస్తారని కాకపోయినా.. టీడీపీలో టికెట్ కోసం పోటీ చేస్తున్న వారిలో బలమైన అభ్యర్థిని ఫైనల్ చేశారు. ఈ జాబితాలో ఉన్నవారిలో ప్రత్యర్థులను ఓడించడమో.. లేదంటే గట్టిపోటీ ఇవ్వడమో జరుగుతుందని చంద్రబాబు నమ్మకం. ఎక్కడా మొహమాటాలకు పోకుండా ఆయన అభ్యర్థుల ఎంపిక చేశారు. సమస్యలు ఉన్న నియోజవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించలేదు. ప్రకటించిన జాబితాలో మాత్రం బలమైన అభ్యర్థులకే సీట్లు ఇచ్చామని చంద్రబాబు నమ్మకం.

అయితే, వైసీపీ అధిష్టానాన్ని దిక్కరించి టీడీపీలో చేరిన వారిలో ఒక్కరికే టికెట్ దక్కింది. ఎమ్మెల్సీ ఎన్నికల టైంలో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ అభ్యర్థికి ఓటు వేశారని అధిష్టానం వారిపై వేటు వేసింది. అందులో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామానారాయణ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి ఉన్నారు. వీరంతా నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు. వీరితో పాటు.. గుంటూరు జిల్లాలో తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా టీడీపీకే ఓటు వేశారని ఆమెపై కూడా వేటు పడింది. వీరంతా ఆ తర్వాత టీడీపీలో చేరారు. కానీ, వీరిలో ఒక్క కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మాత్రమే చంద్రబాబు టికెట్ కేటాయించారు. అది కూడా తన సిట్టింగ్ స్థానం నెల్లూరు రూరల్ టికెట్ ఇచ్చారు. కానీ, మిగిలిన వారు తొలి జాబితాలో టికెట్ దక్కించుకోలేదు.

ఉండవల్లి శ్రీదేవి ప్రాతినిథ్యం వహిస్తున్న తాడికొండ నుంచి టీడీపీ నేత శ్రావణ్ కుమార్ కు టికెట్ కేటాయించారు. అలా అని గుంటూరు, కృష్ణా జిల్లాలో ఎస్సీ రిజర్వుడు స్థానాలు ఏమైనా ఖాళీ ఉన్నాయి… రెండో జాబితాలో ఆమె పేరును ప్రకటిస్తారా? అంటే అది కూడా లేదు. ఈ రెండు జిల్లాల్లో అన్ని ఎస్సీ రిజర్వుడ్ స్థానాలు కూడా ప్రకటించేశారు. గుంటూరు వేమూరు నియోజవర్గం నుంచి నక్కా ఆనందబాబు పోటిలో ఉంటారు. తొలి జాబితాలో ఆయన పేరు ఉంది. ఇక.. ప్రత్తిపాడు నుంచి రామాంజనేయులుకు టికెట్ కేటాయించారు. కృష్ణా జిల్లాలో కూడా పామర్రు, నందిగామ, తిరువూరు సీట్లను కేటాయించేశారు. దీంతో.. ఉండవల్లి శ్రీదేవి ఈ సారి టీడీపీ తరఫున టికెట్ పోటీ చేయనట్టే.

ఇక.. ఉదయగిరి నుంచి గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి కూడా షాక్ తగిలినట్టే చెప్పాలి. ఎందుకంటే ఉదయగిరి టికెట్ కాకర్ల సతీష్ కు ప్రకటించారు. మరి మేకపాటికి ఏమైనా నామినేటడ్ పోస్ట్ ఆఫర్ చేస్తారేమో చూడాలి. ఇక సీనియర్ నేత ఆనంరామానాయణ రెడ్డి.. ఆయన వైసీపీలో తొలి నుంచి వ్యతిరేక స్వరాలు వినిపిస్తూ వచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల టైంలో క్రాస్ ఓటింగ్ చేశారు. అందుకే ఆయన్ని కూడా వైసీపీ సస్పెండ్ చేసింది. ఇప్పుడు ఆయన పోటీపై కూడా ఉత్కంఠ కొనసాగుతోంది. ఆయన పోటీ చేసిన వెంకటగిరి స్థానానికి చంద్రబాబు అభ్యర్థిని ప్రకటించలేదు. కానీ, మాజీ ఎమ్మెల్యే గొనుగుంట్ల రామకృష్ణ పోటీకి సిద్దంగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఈయన ఓడిపోయారు. ఈసారి ఆ సిపంతి పని చేస్తుందని ప్రచారం ఉంది. కానీ, చంద్రబాబు ఎవరి వైపు మొగ్గు చూపుతారో చూడాలి. అయితే.. ఏది ఏమైనా మొహమాటాలకు పోకుండా చంద్రబాబు.. గెలుపు అవకాశాలు ఉన్నవారికే టికెట్లు కేటాయిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -