Karnataka: రూ.10కోట్ల కుక్క గురించి తెలుసా? కర్ణాటకలో ఇప్పుడది ఫేమస్!

Karnataka: మూగజీవాలంటే చాలామందికి ప్రేమ ఉంటుంది. మరీ ముఖ్యంగా కుక్కలంటే చాలామందికి ప్రాణం. ఎందుకంటే మనుషుల కన్నా కుక్కలు ఎంతో విశ్వాసంగా ఉంటాయని చాలామంది నమ్ముతారు. అందుకే వాటి మీద ఎనలేని ప్రేమను ప్రదర్శిస్తుంటారు. అయితే కర్ణాటకలో ఇప్పుడు ఓ కుక్క తెగ ఫేమస్ అయ్యింది. ఇంతకీ ఆ కుక్క కథ ఏంటో తెలుసుకుందాం.

కర్ణాటకలోని శివమొగ్గలో డాగ్ షో జరిగింది. ఈ డాగ్ షోలో దాదాపు 100 మంది తమ వద్ద ఉన్న కుక్కలతో వచ్చారు. మొత్తంగా 22 జాతుల కుక్కలు ఈ డాగ్ షోకు రాగా.. ఓ కుక్క కోసం జనాలు తెగ ఆసక్తి చూపించారు. ఆ కుక్కతో సెల్ఫీ కోసం జనాలు పోటీపడ్డారు. అంతలా జనాలు పోటీపడటానికి కారణం ఏంటంటే.. ఆ కుక్క ఖరీదు ఏకంగా రూ.10కోట్లు.

కర్ణాటకకు చెందిన కడవం సతీష్ అనే వ్యక్తి ఎంతో ప్రేమతో ఓ కుక్కను తెప్పించుకున్నాడు. ఆ కుక్క ఖరీదు ఏకంగా పది కోట్లు ఉండటం విశేషం. ముద్దుగా భీమా అని పేరు పెట్టుకున్న ఆ పది కోట్ల విలువైన కుక్కను చైనాలోని బీజింగ్ నుండి ప్రత్యేక విమానంలో ఇండియాకు రప్పించారట. టిబెట్ మస్టివ్ జాతికి చెందిన అరుదైన కుక్క అంటే తనకు ఎంతో ఇష్టం అని కడవం సతీష్ పేర్కొన్నాడు.

ఎంతో ప్రేమతో చూసుకుంటున్న భీమా అనే కుక్క కోసం తన ఇంట్లో ప్రత్యేకంగా ఏసీ రూంను కేటాయించినట్లు కడవం సతీష్ పేర్కొన్నాడు. కుక్క మెయింటెనెన్స్ కోసం నెలకు దాదాపు రూ.25వేలకు పైగా ఖర్చు చేస్తున్నట్లు ఆయన పేర్చొన్నారు. దీంతో అక్కడున్న వారంతా ఆ కుక్కతో సెల్ఫీలు దిగడానికి క్యూ కట్టారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -