Liquor Shops: ఏపీ బోర్డర్లలో కర్ణాటక మద్యం దుకాణాలు.. ఆ ప్రభుత్వం ఏపీ పరువు తీస్తోందిగా!

Liquor Shops: ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం తీసుకున్న ప్రతీ నిర్ణయం సొంత రాష్ట్రానికి ఎంత మంచి చేసిందో తెలియదు కానీ.. పక్క రాష్ట్రాలకు మాత్రం బాగానే లాభం చేశాయి. గత ప్రభుత్వాలు కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవడం జగన్ సర్కార్ స్టైల్. దీంతో.. ఏపీ నుంచి చాలా కంపెనీలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. అంతెందుకు.. ప్రస్తుతం హైదరాబాద్‌లో లులూ మార్ట్ పేరు గట్టిగా వినిపిస్తుంది. నిజానికి వైజాగ్‌లో వినిపించాల్సినే పేరు అది. కానీ, జగన్ సర్కార్ నిర్ణయాల వలన లూలు మార్ట్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. దీంతో కనీసం రెండు వేలమంది యువత ఉపాధి కోల్పోయారు. ఇక, గల్లా జయదేవ్ కంపెనీ అమర్ రాజా బ్యాటరీస్ లాంటివి కూడా చాలా ఏపీ నుంచి తరలిపోయాయి. జగన్ నిర్ణయాలతో పారిశ్రామిక వేత్తలు పరుగులు తీయడం. అది పక్క రాష్ట్రాలకు వరప్రదాయనిలా మారింది.

ఏపీలో మరో అంశం కూడా కర్నాటక రాష్ట్రానికి గొప్ప వరంలా మారింది. అదే ఏపీలోని లిక్కర్ పాలసీ. ఏపీలో లిక్కర్ రేట్లు ఎక్కువగా ఉండటంతో పాటు.. లోకల్ బ్రాండ్లు మాత్రమే అందుబాటులో ఉండటంతో మందుబాబులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తప్పక ఈ మందును తీసుకుంటున్నారు. లిక్కర్ రేట్లు పక్క రాష్ట్రాలతో పోల్చితే డబుల్, ట్రిపుల్ ఉన్నాయి. దానికితోడు క్వాలిటీ లేని బ్రాండ్ల వలన మందుబాబులు అనారోగ్యానికి గురవుతున్నారు. దీంతో.. కర్నాటక రాష్ట్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ బోర్డర్‌లో బార్లను ఓపెన్ చేస్తోంది. ఇప్పటికే రాయలసీమ, కర్నాటక బోర్డర్ లో పెద్ద ఎత్తున బార్లు వెలుస్తున్నాయి. దానికి రాయలసీమ మందుబాబులు పరుగులు తీసున్నారు. అక్కడ తక్కువ రేట్లతో ఎక్కువ క్వాలిటీ మందు దొరుకుతోంది. దీంతో.. కర్నాటక ప్రభుత్వం ఏపీ మందుబాబుల నుంచి బాగా లాభాలు అర్జిస్తుంది.

అయితే, ఇప్పుడు కర్నాటక ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది కానీ.. ఇప్పటికే తెలంగాణ, ఏపీ బోర్డర్‌లో కూడా పెద్ద ఎత్తున బెల్ట్ షాపులు ఓపెన్ అయ్యాయి. ఖమ్మం, నల్గొండ జిల్లాల బోర్డర్ లో ఎక్కువగా ఉన్నాయి. ఏపీలో బోర్డర్‌లో ఉన్నవారంతా అక్కడికే వెళ్లి తాగుతూ ఉంటారు. పక్క రాష్ట్రం నుంచి ఏపీకి మందు తెచ్చుకోవడానికి పర్మిషన్ లేదు, ఏపీలో మంచి బ్రాండ్లు దొరకవు. కేవలం జగన్ బినామీలకు చెందిన బ్రాండ్లు మాత్రమే దొరుకుతాయి. వాటిని తాగి ఆరోగ్యాన్ని పాడుచేసుకునే కంటే.. బోర్డర్‌లోకి వెళ్లి వెళ్లి రావడం బెటర్ అనుకుంటున్నారు. అందుకే కర్నాటక, తెలంగాణకు వెళ్తున్నారు. అటు, ఒడిశా బోర్డర్‌లో ఉన్న శ్రీకాకుళం, విజయనగరం ప్రజలు కూడా అటు నుంచి మందు కొనుకుంటారు. మొత్తానికి ఏపీలోని లిక్కర్ పాలసీతో పక్క రాష్ట్రాలు బాగా లాభాలు అర్జిస్తున్నాయి.

ఇదే లిక్కర్ పాలసీ వలన ఏపీలో ఆస్పత్రి యాజమాన్యాలు లాభాలు గడిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మందును సేవించి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. దీంతో వారంతా ఆస్పత్రి పాలవుతున్నారు. ఈ లిక్కర్ వలన చాలా మంది లివర్ క్యాన్సర్ కు గురవుతున్నారని పలు సర్వేల్లో తేలింది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -