AP Land: హైదరాబాద్‌లో ఎకరం 100 కోట్లు.. ఏపీలో ఎకరం ఖరీదు మాత్రం ఇంతేనంటూ?

AP Land: మొన్నటికి మొన్న తెలంగాణ సీఎం కేసీఆర్ అన్న మాటలే నిజమయ్యాయి. రికార్డులు బద్దలు కొడుతూ హైదరాబాదులో భూముల ధర 100 కోట్లు పలికింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ నిర్వహిస్తున్న కోకాపేట్ నియో పోలీస్ పేస్ టు వేలంలో భూముల కోసం పెద్ద ఎత్తున పోటీపడినప్పుడు హైదరాబాద్ చరిత్రలోనే అత్యధికంగా ఎకరం 100 కోట్లకు పైగా పలికింది ఇది మార్కెట్ వర్గాల్లో సంచలనంగా మారింది. హెచ్ఎండిఏ సంస్థ నిన్న మొత్తం 45.33 ఎకరాలు ఆన్లైన్లో వేలంపాట వేస్తే మొత్తం 3,319. 60 కోట్లు ఆదాయం వచ్చింది.

అంటే సగటున ఎకరం 73.23కోట్లు పలికింది. అక్కడ రేట్లు అంత ధర పలుకుతున్నాయి అంటే అక్కడ కెసిఆర్ చేసిన అభివృద్ధి అలాంటిది. హైదరాబాద్ డెవలప్మెంట్ ఆ రేంజ్ లో ఉంది మరి ఆంధ్రప్రదేశ్ లో ఏ రేంజ్ లో ఉంది అంటే ఉద్యోగులకి సకాలంలో జీతాలు ఇవ్వలేని దయనీయ పరిస్థితులలో ఉంది. ఇదివరకు కేసీఆర్ హైదరాబాదులో ఒక ఎకరం అమ్ముకుంటే ఆంధ్రాలో మూడు ఎకరాలు కొనుక్కోవచ్చని స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు వైసీపీ మంత్రులకి పౌరుషం పొడుచుకొచ్చింది.

 

అదే హైదరాబాదులో ఇప్పుడు ఎకరం 101 కోట్లకు అమ్ముడైతే దాంతో ఏపీలో ఎన్ని ఎకరాలు కొనుక్కోవచ్చో రియల్ ఎస్టేట్ వ్యాపారులైన వైసీపీ నేతలకి బాగానే తెలిసి ఉంటుంది అని సెటైర్లు వేస్తున్నారు టీడీపీ వర్గం వారు. నిజానికి జగన్ మోహన్ రెడ్డి తో సహా చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలకి మంత్రులకి హైదరాబాదులో అనేక భూములు ఇల్లు ఉన్నాయి. హైదరాబాదు అభివృద్ధి చెందుతున్న కొద్ది వారి ఆస్తులు కూడా అభివృద్ధి చెందుతున్నట్లే. అయితే తెలంగాణని చూసి అయినా ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్లాలని ఆలోచన వైసీపీ కి కలగకపోవడం నిజంగా శోచనీయం.

 

నిజానికి చంద్రబాబు నాయుడు వేలకోట్లు ఖర్చు చేసి అమరావతిని కొంతవరకు అభివృద్ధి చేశారు. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేస్తే ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలు అభివృద్ధి చెందుతాయని కలలు కన్నారు. కానీ జగన్ ప్రభుత్వం మాత్రం చంద్రబాబు నాయుడు మీద వ్యక్తిగత కక్ష ద్వేషాలతో లక్షల కోట్ల విలువగల అమరావతిని నిర్ధాక్షిణ్యంగా పక్కన పెట్టేసారు. తరువాత రివర్స్ టెండరింగ్ తో పాలన సాగిస్తుండడం వల్ల ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలుగా వెనకబడిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా భూములు ఆ రేట్లు పలకాలంటే ఎన్నాళ్ళు వేచి చూడాలో మరి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -