Jagan: ఏపీలో ఇలాంటి పరిస్థితా.. జగనన్నా గమనిస్తున్నావా?

Jagan: తెలంగాణలో కేబుల్ బ్రిడ్జి ప్రస్తావన వస్తే ఇప్పటివరకు హైదరాబాదులోని దుర్గం చెరువు మీద నిర్మించిన బ్రిడ్జి గుర్తొస్తుంది. ఇప్పుడు రెండో కేబుల్ బ్రిడ్జి ప్రారంభానికి సిద్ధమైంది. కరీంనగర్లో మానేరు నదిపై 224 కోట్లతో ఈ బ్రిడ్జిని నిర్మించారు. ఈ బ్రిడ్జితో కరీంనగర్ మీదుగా వరంగల్ కు వెళ్లే వాహనాలు రాకపోగలకు ట్రాఫిక్ రద్దీ లేకుండా ఉండటంతో పాటు దూర భారం కూడా తగ్గుతుంది.

ఈ వంతెన అందుబాటులోకి వస్తే జగిత్యాల, పెద్దపల్లి, అదిలాబాద్, సిరిసిల్ల తదితర ప్రాంతాల నుంచి కరీంనగర్ మానేరు వంతెన రహదారి మీదుగా వరంగల్, విజయవాడకు వెళ్లే వారికి ఏడు కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. వంతెన నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ఆర్ అండ్ బి అధికారుల సమక్షంలోనే బ్రిడ్జిపై ఫుడ్ వినోదాత్మ కష్టాలు ఏర్పాటు చేస్తున్నారు సాయంత్రం సమయంలో లైటింగ్ వెలుగులో ఫ్రెండ్స్ ఫ్యామిలీతో కలిసి సరదాగా గడిపేందుకు వీలుగా మ్యూజిక్ కొరియా సాంకేతికత తో డైనమిక్ లైటింగ్ సిస్టం, నాలుగు ఎల్ ఎన్ ఎస్ ఈ డి తెరలను కూడా ఏర్పాటు చేశారు.

 

తెలంగాణ గురించి ఇంతలా మాట్లాడుకుంటున్న మనం ఏపీ గురించి ఏమని మాట్లాడుకోవాలి. చెప్పుకోవటానికి ఏపీలో అలాంటి బ్రిడ్జిలు ఏమీ లేవు. శ్రీకాకుళం జిల్లాలో ఒడిశా ఆంధ్ర రాష్ట్రాలను కలుపుతూ బ్రిటిష్ కాలంలో ఒక వంతెన నిర్మించారు. అది ఈరోజు రేపు కూలిపోతుందని అక్కడ స్థానికులు ఎప్పటినుంచో అధికారులని కోరుకుంటున్నారు. అయినా స్పందించలేదు మన ఏపీ అధికారులు.ఆఖరికి ఏపీకి వస్తున్న ఒక ట్రక్ తో సహా ఆ వంతెన కుప్ప కూలిపోయింది.

 

అప్పుడైనా కొత్త బ్రిడ్జి నిర్నిస్తారు అనుకుంటే రెండు వైపులా రెండు గోడలు నిర్మించి. వంతెన కూలిపోయింది కాబట్టి రాకపోకలు నిషేధం అని రాయించి బోర్డు పెట్టారు ఏపీ లో పరిస్థితి ఇంత దారుణమా అని జనాలు నోరెళ్లబెట్టలాగా చేశారు మన అధికారులు. ఇంకా ఆశ్చర్యపడే విషయం ఏమిటంటే కరీంనగర్ లో కేబుల్ బ్రిడ్జి గురించి సాక్షి మీడియా తెగ వర్ణిస్తుంది. కానీ ఏపీలో అటువంటి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని చూపలేకపోతుంది. జగనన్న గమనిస్తున్నావా ఏపీకి, తెలంగాణకి ఉన్న వ్యత్యాసం..

 

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -