తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం షాకిచ్చాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం బీఆర్ఎస్ శ్రేణులకు ఊహించని షాకిచ్చింది. అయితే ఎక్కువమంది తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమికి కేసీఆర్ స్వయంకృతాపరాధమే కారణమని అభిప్రాయపడుతున్నారు.

హామీల అమలు విషయంలో మాట తప్పిన ధోరణి :

బీఆర్ఎస్ చేసిన కొన్ని తప్పులు ఆ పార్టీ ఘోర పరాజయానికి కారణమయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలోని తొమ్మిదేళ్ల పాటు అధికారంలో ఉన్నా కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేయడంలో ఫెయిలయ్యారు. దళిత బంధు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు స్కీమ్స్ వల్ల మెజారిటీ ప్రజలు ప్రయోజనాలను పొందలేదు. నిరుద్యోగ భృతి హామీ విషయంలో కేసీఆర్ సర్కార్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు.

నిరుద్యోగుల విషయంలో క్షమించరాని తప్పిదాలు :

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగాన్ని తగ్గించే దిశగా కేసీఆర్ పూర్తిస్థాయిలో అడుగులు వేయలేదు. పేపర్ లీకేజీలు ప్రభుత్వం పరువును తీసేయడంతో పాటు ప్రభుత్వంపై పార్టీలో ఉన్న విశ్వసనీయతను తగ్గించాయి. ప్రభుత్వ జాబ్ నోటిఫికేషన్లు విడుదలైనా కేసీఆర్ పాలనలో వేర్వేరు ఇబ్బందులు రావడంతో నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఆసక్తి చూపించారు.

అవినీతి ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం :

తెలంగాణ కోసం ఏర్పడ్డ టీఆర్ఎస్ పార్టీ పేరు బీఆర్ఎస్ గా మార్చడంపై ప్రజల్లో ఒకింత వ్యతిరేకత వ్యక్తమైంది. జాతీయ రాజకీయాలను శాసించాలనే కేసీఆర్ ఆలోచన అది పెద్ద తప్పు అని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారు. బీఆర్ఎస్ పార్టీలోని ప్రధాన నేతలలో చాలామంది నేతలపై అవినీతి ఆరోపణలు వ్యక్తమయ్యాయి. అయితే కేసీఆర్ వాళ్లపై చర్యలు తీసుకున్నట్టు ఎక్కడా వినిపించలేదు.

ప్రభుత్వ పాలనలో మితిమీరిన కుటుంబ సభ్యుల జోక్యం :

కేసీఆర్ పాలనలో కుటుంబ సభ్యుల జోక్యం ఎక్కువైందని కుటుంబ సభ్యులకు దక్కిన ప్రాధాన్యతలో పదో వంతైనా పార్టీ కోసం కష్టపడిన ముఖ్య నేతలకు సైతం దక్కలేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ధరణి పోర్టల్ విషయంలో వ్యక్తమైన విమర్శలకు చెక్ పెట్టే విషయంలో సైతం కేసీఆర్ ఫెయిల్ అయ్యారు. లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కూతురు పేరు వినిపించడం బీఆర్ఎస్ కు చేటు చేసింది.

తెలంగాణ అభివృద్ధిని హైదరాబాద్ కే పరిమితం చేయడం :

పట్టణ ఓటర్లను టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ ప్రచారం సాగించడం, హైదరాబాద్ మినహా ఇతర తెలంగాణ జిల్లాల్లో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగకపోవడం కూడా బీఆర్ఎస్ ఓటమికి కారణాలయ్యాయి. తెలంగాణలో బీఆర్ఎస్ పాలనలో అర్హులకు సంక్షేమ పథకాలు అందలేదు. ఉద్యోగుల్లో సైతం కేసీఆర్ పాలనపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉంది. ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో గతంలో కేసీఆర్ వ్యవహరించిన తీరు విమర్శలకు తావిచ్చింది.

Related Articles

ట్రేండింగ్

Bandla Ganesh-Roja: రోజా పులుసు పాప.. బండ్ల గణేష్ లేకి వ్యాఖ్యలు ఎంతవరకు రైట్ అంటూ?

Bandla Ganesh-Roja: సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్ల అదే విధంగా ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం...
- Advertisement -
- Advertisement -