Hyderabad: ఇద్దరితో ప్రేమాయణం.. ప్రియుడి కోసం యువతుల కొట్లాట.. ఏం జరిగిందంటే?

Hyderabad: ప్రస్తుత కాలంలో ప్రేమించి పెళ్లి చేసుకోవడం చాలా సర్వసాధారణంగా జరుగుతుంది. అయితే ఒక అమ్మాయి ప్రేమలో ఉంటూ మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నటువంటి కొంతమంది ఆకతాయిలు కూడా సమాజంలో ఉన్నారు అని చెప్పాలి. తాజాగా ఇలాంటి ఘటన హైదరాబాదులో చోటు చేసుకుంది ఆంధ్రప్రదేశ్ రాయచోటికి చెందినటువంటి బాబా ఫక్రుద్దీన్ అనే యువకుడు హైదరాబాద్ మాదాపూర్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో పని చేస్తున్నారు.

ఈ హాస్పిటల్లో పనిచేసే ఒక యువతి తో ఈయన పరిచయం ఏర్పరచుకొని తనని పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి నమ్మించారు ఈ క్రమంలోనే తరచు తన గదికి వెళ్తూ ఈయన తన కోరికలను తీర్చుకున్నారు అయితే ఉన్నఫలంగా బాబా ఫక్రుద్దీన్ హాస్పిటల్ మారిపోయారు. ఇలా ఆ హాస్పిటల్లో ఉన్న అమ్మాయితో కూడా ఇదే తంతు రిపీట్ చేశారు అయితే ఆ అమ్మాయిని కూడా కాదని ఈనెల ఆరవ తేదీ స్వగ్రామానికి వచ్చి దాన్ని ఇంటి పక్కన ఉన్నటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు.

ఇలా వీరిద్దరి కుటుంబ సభ్యుల సమక్షంలో జరగబోతూ ఉండగా వెంటనే పోలీసులు వచ్చి ఈతంగాన్ని అడ్డుకొని తనని మాదాపూర్ పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు దీంతో తన చేతిలో మోసపోయినటువంటి ఇద్దరు యువతులు పోలీస్ స్టేషన్ కి చేరుకొని బాబా ఫక్రుద్దీన్ చేతిలో నేను ముందు మోసపోయాను అంటే తను నాకే సొంతం అంటూ ఇద్దరు గొడవపడ్డారు ఇలా వీరి గొడవ చూసి ఎస్ఐ ఏం చేయాలో దిక్కు తోచక తలలు పట్టుకున్నారు.

ఈ విధంగా ఒక వ్యక్తి చేతిలో మోసపోయినటువంటి ఆ అమ్మాయిలు ఇద్దరు కూడా ఆయన నాకే సొంతం అంటూ గొడవ పడటంతో ఏం చేయాలో దిక్కుతోచక ఎస్ఐ బాబా ఫక్రుద్దీన్ రిమాండ్ కు తరలించారు. ఏది ఏమైనా బాబా ఫక్రుద్దీన్ చేసినది పూర్తిగా తప్పే అని చెప్పాలి ఇద్దరి యువతల జీవితంతో ఆడుకొని మరో పెళ్లికి సిద్ధం కావడంతో ఈయన పట్ల చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు .

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -