Hyderabad: హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీ నిరసనలు.. అక్కడ ఎన్ని చేసినా ఏం లాభమంటూ?

Hyderabad: తెదేపా అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా హైదరాబాదులోని అన్ని మెట్రో స్టేషన్లలో తెలుగుదేశం అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు, సామాన్యులు ఆందోళన చేపట్టారు. కొన్నిచోట్ల హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ వరకు మెట్రో రైలులో నల్ల టీ షర్టులతో ప్రయాణించాలని మద్దతుదారులు పిలుపునిచ్చారు. దీంతో మియాపూర్ మెట్రో స్టేషన్ కు భారీగా నిరసనకారులు చేరుకున్నారు.

అయితే టెక్నికల్ రీజెన్ అంటూ మెట్రో స్టేషన్ ని అధికారులు మూసివేయడంతో చంద్రబాబు మద్దతుదారులు వారితో వాగ్వాదానికి దిగారు. అదే సమయంలో నల్ల చొక్కాలు వేసుకుంటే అనుమతి లేదని మెట్రో సిబ్బంది మైక్ లో అనౌన్స్ చేసారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ వరకు మెట్రో రైలులో నల్ల టీ షర్టులతో ప్రయాణిస్తూ నిరసన తెలపాలని చంద్రబాబు మద్దతుదారులు పిలుపునిచ్చారు.

దీంతో అన్ని మెట్రో స్టేషన్లకు తెదేపా మద్దతుదారులు చేరుకున్నారు. పొరపాటున కూడా నల్లజొక్కాలు ధరించిన ప్రయాణికులనే కాదు మెట్రో సిబ్బందిని సైతం పోలీసులు అనుమతించలేదు. నల్ల చొక్కాలు ధరించిన వారిని కొట్టుకుంటూ పోలీసులు తీసుకువెళ్లారు. పోలీసులు తీరుపై చంద్రబాబు మద్దతుదారుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లెట్స్ మెట్రో ఫర్ సిబిఎన్ కార్యక్రమం కోసం ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గరికి వచ్చారు. మరోవైపు చంద్రబాబుకు మద్దతుగా అమరావతి ప్రాంతం తూళ్లూరులోని రాజధాని రైతుల భారీ ప్రదర్శన నిర్వహించారు.

తూళ్లూరులోని గ్రంథాలయ కూడలిలో రోడ్డుపై బైఠాయించి మహిళలు నిరసన చేపట్టారు. చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలంటూ మౌన దీక్ష కొనసాగించారు. వైసీపీ సర్కారు కక్ష సాధిస్తుందని తెలంగాణ తెలుగు మహిళా అధ్యక్షురాలు జ్యోష్న ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబుకు బాసటగా లక్డికాపూల్ మెట్రోలో ప్రయాణించారు. అలాగే చిన్నారులు సైతం బాబుతో మేము సైతం అంటూ గళం విప్పారు. అయితే కొందరు తెలంగాణవాదులు ఇక్కడ ధర్నాలు చేసి ఏం లాభం, జగన్ దగ్గరికి వెళ్లి అక్కడ చూపించండి మీ ప్రతాపం అంటూ ధర్నా నిర్వహిస్తున్న వారితో వాగ్వదానికి దిగారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -