Liquor in CM Jagan Campaign: సీఎం సభల్లో 20 లక్షలకు పైగా సీసాల పంపిణీ.. మరీ ఇంత అరాచక పాలన జరుగుతోందా?

Liquor in CM Jagan Campaign: రాష్ట్రంలో ఎవరి దగ్గరైన మూడు మందు సీసాలకు మించి ఉండకూడదు కానీ జగన్మోహన్ రెడ్డి సభలకు మాత్రం లక్షల్లో మందు సీసాలు వెళ్తుండటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ప్రస్తుతం ఎన్నికల హడావిడి ఏపీలో భారీగా కనిపిస్తోంది ప్రతి ఒక్క పార్టీ నేతలు ప్రచార కార్యక్రమాలు అంటూ సభలను నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే నాలుగు సిద్ధం సభలను నిర్వహించారు అలాగే 12 మేమంతా సిద్ధం సభలను నిర్వహించారు ఈ సభలకు భారీ స్థాయిలో జనాలు వస్తున్నారు.

ఇలా ఈ సభలకు పెద్ద ఎత్తున జనాలు తరలివస్తున్నారు అంటే అది జగన్ పై ఉన్నటువంటి అభిమానం అనుకుంటే మనం పొరపాటు పడినట్లే. ఈ సభలకు జనం రాకపోయినా పెద్ద ఎత్తున వారికి డబ్బు మద్యం ఆశ చూపించి బస్సులతో జనాలను తరలిస్తున్నారు. ఇలా సిద్ధం సభల కోసం జనాలను తరలించడానికి భారీ స్థాయిలో మద్యం చేరుతోందని తెలుస్తోంది.

జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్నటువంటి సభలకు సుమారు 1000 నుంచి 1200 వరకు ఆర్టీసీ బస్సులు తరలిస్తున్నారు అయితే ఒక్కో ఆర్టీసీ బస్సులో సుమారు 100 సీసాలకు పైగా మద్యం కేసులను ఉంచుతున్నారు. బస్సు ఎక్కగానే కొంత దూరం ప్రయాణించగా ప్రతి ఒక్కరి చేతిలో మనకు మద్యం సీసా కనపడుతుంది. ఇలా జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు నిర్వహించినటువంటి సభలకు సుమారు వారు 20 లక్షలకు పైగా మద్యం పంచినట్లు తెలుస్తోంది.

ఈ విధంగా మద్యం మేమంతా సిద్ధం సభలలో ఏరులై పారుతూ ఉన్నప్పటికీ ఈ దృశ్యాలు ఈసీ అధికారులకు ఎందుకు కనిపించడం లేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి ఎందుకని ఈసీ వీటిపై చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు. ఒకరి దగ్గర మూడు మద్యం సీసాలు ఉండడమే కష్టమవుతున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి సభలకు ఇంత మద్యం ఎక్కడి నుంచి వస్తోందని ఏపీలో మరి ఇంత అరాచక పాలన జరుగుతోందా అంటూ ప్రతి ఒక్కరు ముక్కున వేలు వేసుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -