2022: ఈ ఏడాది భారీగా నష్టాలను మిగిల్చిన సినిమాలు ఇవే!

2022: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఏడాదిలో ఎన్నో సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. అందులో కొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతే మరికొన్ని సినిమాలు హిట్ అవుతూ ఉంటాయి. కాగా కొన్ని సినిమాలు భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలుస్తూ ఉంటాయి. మరి కొన్ని సినిమాలు చిన్న సినిమాలు గా విడుదల అయ్యి భారీగా కలెక్షన్స్ ను సాధిస్తూ ఉంటాయి. భారీ అంచనాలు నడుమ విడుదలైన కొన్ని సినిమాలు డిజాస్టర్ గా నిలిచినప్పుడు ప్రేక్షకులు నిరాశ చెందుతూ ఉంటారు. మరి ఈ ఏడాది ప్రేక్షకులను నిరాశపరిచిన ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన మాస్ మహారాజా రవితేజ నటించిన ఖిలాడీ సినిమా ఊహించిన విధంగా డిజాస్టర్ గా నిలిచింది. అలాగే శర్వానంద్ హీరోగా నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా కూడా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఇక టాలీవుడ్ పాన్ ఇండియా ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా కూడా ఊహించే విధంగా డిజాస్టర్ గా నిలిచింది. వరుణ్ తేజ్ హీరోగా నటించిన గణేష్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ఘోరమైన డిజాస్టర్ ను చవిచూసింది. నాని హీరోగా నటించిన అంటే సుందరానికి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.

గోపీచంద్ హీరోగా నటించిన పక్కా కమర్షియల్ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది. హీరో వైష్ణవ తేజ్ నటించిన రంగ రంగ వైభవంగా సినిమా కూడా భారీగా డిజాస్టర్ చవి చూసింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా పరిస్థితి కూడా ఇదే. పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమా భారీగా డిజస్టర్ గా నిలిచింది. నితిన్ హీరోగా నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది. రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది. నాగచైతన్య నటించిన థాంక్యూ సినిమా కూడా ఫ్లాప్ అయింది. రామ్ పోతినేని నటించిన దివారియర్ సినిమా కూడా ఘోరమైన చవి చూసింది. నాగార్జున నటించిన ది గోస్ట్ సినిమా కూడా ఊహించని విధంగా బోల్తా కొట్టింది. ఇట్లు మారేడిపల్లి ప్రజానీకం సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది. ఇందులో హీరోగా అల్లరి నరేష్ నటించిన విషయం తెలిసిందే. మంచు విష్ణు హీరోగా నటించిన జిన్నా సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది.

Related Articles

- Advertisement -

ట్రేండింగ్

LIC policy: ఈ ఎల్ఐసీ పాలసీ గురించి తెలుసా.. రూ.కోటి పొందే అవకాశం!

LIC policy: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వేర్వేరు వర్గాల కస్టమర్ల కోసం పలు రకాల పాలసీలను అందిస్తోంది. కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు వేర్వేరు ఎల్ఐసీ పాలసీలను ప్రకటిస్తూ...
- Advertisement -