Movies: ఈ సినిమాలు డిజాస్టర్ కావడం వెనుక ఇంత కథ నడిచిందా?

Movies: సినిమా ఇండస్ట్రీలో మామూలుగా చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు సినిమా విడుదల సమయంలో సమస్యలు రావడం అన్నది సహజం. ఆ సమస్య నిర్మాత దగ్గర నుంచి రావచ్చు, లేదా ఇతర కారణాలు ఏమైనా కావచ్చు. స్టార్ హీరోలుగా ఉన్న వారీ సినిమాకు కూడా ఒక్కొక్కసారి ఈ ఇబ్బందులు తప్పవు. అలా విడుదలకు ఇబ్బంది పడిన హీరోలలో చిరంజీవి నుంచి బాలకృష్ణ వరకు ఎంతో మంది హీరోలు ఉన్నారు. ఏ హీరో ఏ సినిమాలతో ఇబ్బంది పడ్డారో సమస్యలను ఎదుర్కొన్నారు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో దర్శ‌కుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అంజి సినిమా దాదాపు 6 సంవత్సరాలకు పైగా షూటింగ్ జరుపుకుందట. అలాగే ఎన్నో అవంతరాలు ఎదుర్కొని మొత్తానికి విడుదలై డిజాస్టర్ గా నిలిచింది. నందమూరి బాలకృష్ణ కెరీర్ లో కూడా బాలయ్య నటించిన మహారధి సినిమా కూడా విడుదలకు ముందు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. 2007 సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా పలు కారణాలతో వాయిదా పడుతూ ఆలస్యంగా విడుదలై బాలయ్యకు భారీ నష్టాన్ని మిగిల్చింది. అలాగే హీరో విక్టరీ వెంకటేష్ నటించిన దేవీ పుత్రుడు మూవీ పరిస్థితి కూడా ఇదే.

 

ఈ సినిమాను సీనియర్ దర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించారు. ఈ సినిమా కూడా విడుదలకు ఎన్నో ఇబ్బందులు పడి లేటుగా ప్రేక్షకులు ముందుకు వచ్చి డిజాస్టర్ గా మిగిలింది. అలాగే హీరో నాగార్జున నటించిన ఢ‌మ‌రుకం సినిమా కూడా రిలీజ్‌కి ముందు పలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. ఎలాగోలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అనుకున్నంత రేంజ్‌లో మెప్పించలేకపోయింది. పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన రెబల్ సినిమా పరిస్థితి కూడా ఇదే. ఈ సినిమా రిలీజ్ కి ముందు ఎన్నో ఆర్థిక ఇబ్బందులకు గురైంది. ఇక సినిమా విడుదలై భారీ డిజాస్టర్ గా మిగిలింది. సూపర్ స్టార్ మహేష్ నటించిన ఖలేజా సినిమా కూడా నిర్మాత సింగనమల రమేష్ వివాదాలలో ఇరుకోవడంతో వాయిదా పడుతూ వచ్చి ప్లాప్ అయ్యింది. పవన్ కళ్యాణ్ నటించిన కొమరం పులి సినిమా కూడా టైటిల్ తో పాటు నిర్మాత కూడా వివాదాల్లో ఇరుక్కోవడంతో సినిమా వాయిదా పడుతూ చివరగా ప్రేక్షకులు ముందుకు వచ్చి డిజాస్టర్ గా మిగిలింది. కేవలం స్టార్ హీరోల సినిమాలు మాత్రమే కాకుండా యంగ్ హీరోల సినిమాల పరిస్థితి కూడా ఇదే అని చెప్పవచ్చు. యంగ్ హీరోల నుంచి టాప్ హీరోల వరకు ఆ హీరోలను ఇబ్బంది పెట్టిన అలాగే కాంట్రవర్సీలను ఎదుర్కొన్న సినిమాలు అన్నీ కూడా కాస్త ఆలస్యంగా విడుదల అయినా కూడా డిజాస్టర్ గా నిలిచాయి.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -