5G Smart Phone: అతి తక్కువ ధరకే 5జీ స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ మామూలుగా లేవుగా?

5G Smart Phone: ప్రతి ఏడాది ఎన్నో రకాల మొబైల్ ఫోన్లు మార్కెట్ లోకి విడుదల అవుతూనే ఉంటాయి. కొన్ని మొబైల్ ఫోన్లు బడ్జెట్ ధరలో ఉంటే మరి కొన్ని ఫోన్ లు ఎక్కువ బడ్జెట్లో ఉంటాయి. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఎక్కువగా స్మార్ట్ ఫోన్లు అతి తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లు విడుదలవుతున్నాయి. తాజాగా అలాంటి స్మార్ట్ ఫోన్ ఒకటి మార్కెట్ లోకి విడుదల అయింది. కాగా ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో అదిరే ఆఫర్ లభిస్తోంది. మోటరోలా ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ఎడ్జ్ 20 ప్రో ఫోన్‌పై భారీ ఆఫర్ ను ప్రకటించింది. సూపర్ కెమెరాలు ఈ స్మార్ట్‌ఫోన్ సొంతం అని చెప్పుకోవచ్చు. కాగా ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్, ధర విషయానికి వస్తే..

 

మోటరోలా ఎడ్జ్ 20 ప్రో 5జీ ఫోన్‌ అసలు ధర రూ. 45,999గా ఉంది. అయితే దీన్ని రూ. 24,999కు సొంతం చేసుకోవచ్చు. అంటే రూ. 21 వేల తగ్గింపు అందుబాటులో ఉందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఫోన్‌పై ఇతర ఆఫర్లు కూడా లభిస్తున్నాయి. ఈ స్మార్ట్‌ ఫోన్‌ పై భారీ ఎక్స్చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఏకంగా రూ. 20 వేల వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు. అంటే మీరు మీ పాత ఫోన్ ఇచ్చి కొత్త ఫోన్ కొంటే రూ. 4,999కే 5జీ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. అయితే ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది మీ ఫోన్, దాని కండీషన్ ప్రాతిపదికన మారుతుంది. అందువల్ల మీ ఫోన్‌కు తక్కువ ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా రావొచ్చు.

 

ఒకసారి మీ ఫోన్ ఎక్స్చేంజ్ విలువ చెక్ చేసుకోండి. మోటరోలా ఎడ్జ్ 20 ప్రో 5జీ ఫోన్‌లో 8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ మెమరీ, 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, హెచ్‌డీఆర్ 10 ప్లస్, 144 హెర్జ్ రిఫ్రెష్ రేటు వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఫోన్ 5జీ సపోర్ట్ చేస్తుంది. కెమెరా విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. అలాగే వెనుక భాగంలో 108 ఎంపీ కెమెరా ఉంది. అంతేకాకుండా ఈ ఫోన్‌లో 870 ప్రాసెసర్ ఉంది. 4500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంను కలిగి ఉంది. 30 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 10 నిమిషాలు చార్జింగ్ పెడితే 9 గంటల వరకు మొబైల్ ఫోన్ ని ఉపయోగించుకోవచ్చు. ఈ ఫోన్‌ పై ఈఎంఐ ఆప్షన్లు కూడా ఉన్నాయి. నెలకు రూ. 1213 చెల్లిస్తే ఈ ఫోన్ కొనొచ్చు. 24 నెలలకు ఇది వర్తిస్తుంది. అలాగే నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా ఉన్నాయి. 6 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ పెట్టుకోవచ్చు. నెలకు రూ. 4167 చెల్లించాలి. 3 నెలల వరకు కూడా నో కాస్ట్ ఈఎంఐ ఉంది. కాగా స్టాక్ ఉన్నంత వరకే ఈ ఆఫర్లు లభిస్తాయని గుర్తించుకోవాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -