Gold: 60 ఏళ్ల క్రితం బంగారం ఇంత చీపా.. కచ్చితంగా నోరెళ్లబెట్టాల్సిందే!

Gold: బంగారాన్ని ముట్టుకుంటేనే షాక్ కొట్టేలా ఉంది. రోజు రోజుకీ బంగారం ధర బాగా పెరిగిపోతోంది. స్త్రీలకి బంగారు ఆభరణాలు అంటే ఎంతో మక్కువ. బంగారంతో చేసిన గొలుసులు, ఉంగరాలు, హారాలు ఇలా ఎవరికి నచ్చిన మోడల్స్ ని వాళ్ళు కొంటూ వుంటారు. పైగా ఈరోజుల్లో చాలా రకాల మోడల్స్ వస్తున్నాయి. దాంతో ఎక్కువగా బంగారాన్ని కొంటూ ఉంటారు. పైగా బంగారం కొనడం వలన నష్టం ఏమీ ఉండదు.

బంగారం కొంటే లాభమే. అందుకని చాలా మంది వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నప్పుడల్లా బంగారాన్ని కొంటూ ఉంటారు. ఇప్పుడు బంగారం ధర బాగా పెరిగిపోయింది. ఇది వరకు ఇంత రేటు ఉండేది కాదు. 1959 లో బంగారం ధర చాలా తక్కువగా ఉండేది. అప్పటి బంగారం ధర ఎంతుందో ప్రూఫ్ కూడా వుంది. 1959 కి సంబంధించి ఒక పాత గోల్డ్ బిల్ సోషల్ మీడియాలో తెగ షికార్లు కొడుతోంది. దీంతో అప్పటి రేటు ఇప్పటి రేటు చూసి చాలా మంది అవార్కవుతున్నారు. ఈ ఫోటో మహారాష్ట్ర కి చెందిన ఒక వ్యక్తి షేర్ చేశారు. 1959లో 10 గ్రాముల బంగారం 113 రూపాయలు. అంటే ఒక గ్రాము సుమారు రూ.10 అనమాట. ఈ రోజుల్లో చాలా చాక్లెట్లు పది రూపాయల కంటే ఎక్కువే.

 

అప్పట్లో రూ. 10 ఒక గ్రాము వచ్చేసేది. ఈ గోల్డ్ బిల్ మార్చి 3, 1959 నాటిది. మహారాష్ట్రకి చెందిన వామన్ నింబాజి ఆస్తేకర్ ది. 10 గ్రాముల బంగారం ఇప్పుడు సుమారు 50 వేల రూపాయలు. అంటే ఒక గ్రాము 5 వేల రూపాయలు. అలానే ప్రవీణ్ కస్వన్ అనే ఒక వ్యక్తి గోధుముల బిల్లు ని ఇది వరకు షేర్ చేసారు. 1987 లో గోధుముల ధర కేజీ రూ.1.6 గా ఉండేది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -