Bus conductor: ఈ కండక్టర్ నిజాయితీకి దండం పెట్టాల్సిందే.. గొప్పోడంటూ?

Bus conductor: ప్రస్తుత రోజుల్లో నిజాయితీ అన్న మాటే కరువైపోయింది. కేవలం స్వార్థం అన్న పదం ఎక్కువగా వినిపిస్తూఉంటుంది. మనం దారిలో వెళ్తున్నప్పుడు అలా ఒక పది రూపాయల నోటు కనిపించింది అంటే చాలు వారిది కాకపోయినా వారిది అనే అబద్ధాలు చెప్పి మరి ఆ డబ్బును తీసుకునే వారు చాలామంది ఉన్నారు. ఇంకా చెప్పాలి అంటే లక్షలకు లక్షలు డబ్బులు దొంగతనం చేసే వారు కూడా చాలామంది ఉన్నారు. కొంతమంది నిజాయితీ పరులు పరుల సొమ్ము పాము వంటిది అని ఇతరుల డబ్బులను పావలా కూడా ఆశించరు.

డబ్బు పోగొట్టుకుంటే తిరిగి వారి చెంతకే డబ్బులు చేర్చే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. అటువంటి వారిలో ఇప్పుడు మనం తెలుసుకోబోయే బస్సు కండక్టర్ కూడా ఒకరు. కాగా బస్సు కండక్టర్ ఏకంగా 50 తులాల బంగారాన్ని నిజాయితీగా పోగొట్టుకున్న మహిళకు తిరిగి అప్పగించాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో చోటు చేసుకుంది. విశాఖపట్నం కాంప్లెక్స్‌లో ఆర్టీసీ బస్సులో పలాస డిపోకు చెందిన ఏపీ 30 జెడ్ 0070 నంబర్ బస్సు ఆగి ఉంది. వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లి గ్రామానికి చెందిన శోభారాణి ప్రయాణం చేయడం కోసం తన లగేజీ బ్యాగు బస్‌లో ఉంచింది. తర్వాత ఏదో పని గుర్తుకు వచ్చి కిందకు దిగంది.

 

అయితే ఆమె బస్‌ దిగే విషయం కండక్టర్‌, డ్రైవరుకు చెప్పకుండా కిందికి దిగి వెళ్లిపోయింది. కానీ పని చూసుకుని తిరిగి వచ్చే సరికి ఆమె లగేజ్‌ పెట్టిన బస్సు అక్కడ లేదు. తన లగేజ్‌లో భారీగా అంటే సుమారు 50 తులాల బంగారం ఉంది. వెంటనే ఆమె ఈ విషయం గురించి అక్కడే ఉన్న టెక్కలి డిపో కండక్టర్‌ ధనుంజయకు ఆ విషయం చెప్పింది. విషయం తెలుసుకున్న వెంటనే ఆయన పలాస ఆర్టీసీ డిపో సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వెంటనే డిపో నుంచి ఆ బస్సు కండక్టర్‌ ఆర్‌.వి.రావుకు సమాచారం అందించారు. ఆయన డ్రైవర్‌తో కలిసి బ్యాగును గుర్తించి భద్రపరిచారు. అనంతరం పలాసలో డిపో మేనేజర్‌కు బ్యాగ్‌ను అందజేశారు. బ్యాగ్‌ దొరికిందన్న సమాచారం అందుకున్న శోభారాణి శుక్రవారం మధ్యాహ్నం డిపోకు వచ్చారు. దాదాపుగా రూ.35 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, దుస్తులు ఉన్న బ్యాగును తీసుకున్నారు. బంగారం, బ్యాగును జాగ్రత్తగా భద్రపరిచిన డ్రైవర్‌ ఎన్‌.హెచ్‌.ప్రసాద్‌, కండక్టర్‌ ఆర్‌.వి.రావులను డిపో మేనేజర్‌ వి.శ్రీనివాస అభినందించారు. పోయిందనుకున్న బంగారం దొరకడంతో శోభారాణి సంతోషం వ్యక్తం చేశారు. తన లగేజ్‌ తిరిగి అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ వార్త కాస్త ఆ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజెన్స్ కండక్టర్ పై బస్సు డ్రైవర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -