Gold: బంగారు ఆభరణాలను తాకట్టు పెడుతున్నారా.. ఈ తప్పులు చేస్తే మీ బంగారం గోవింద!

Gold: మన హిందూ సంప్రదాయాల ప్రకారం బంగారును సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము.అందుకే బంగారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటామో అయితే కొన్నిసార్లు మనకు అనుకోకుండా అవసరాలు వస్తూ ఉంటాయి. ఇలాంటి అవసరాలను తీర్చడం కోసం చాలామంది ఇతరుల వద్ద అప్పు చేయకుండా ఇంట్లో ఉన్నటువంటి బంగారు నగలను తాకట్టు పెడుతూ ఉంటారు.

 

లక్ష్మీ స్వరూపమైనటువంటి బంగారాన్ని తాకట్టు పెట్టే సమయంలో మనం కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలని పండితులు చెబుతున్నారు. మనం అత్యవసర పరిస్థితులలో బంగారాన్ని తాకట్టు పెట్టాల్సి వస్తే ముందుగా లక్ష్మీదేవిని పూజించి మీ స్వరూపమైనటువంటి బంగారాన్ని తాకట్టు పెడుతున్నందుకు క్షమించమని క్షమాపణలు కోరుకోవాలి. ఇలా క్షమాపణలు కోరుకున్న తర్వాత బంగారం తాకట్టు పెట్టాలి.

ఇలాబంగారం తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుతో ఎవరు కూడా విలాసాలకు పోకూడదు. ఆ డబ్బులను వారి ఖర్చులకోసం ఉపయోగించకూడదు ఏదైనా వ్యాపారాల కోసం ఆరోగ్యపరంగా చికిత్స తీసుకోవడం కోసం ఉపయోగించాలి అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉండి తిరిగి మన బంగారం మన వద్దకు చేరుతుంది. ఇలా లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటే తిరిగి మన బంగారం మనం వెనక్కి విడిపించుకుంటాము.

 

ఇలా బంగారం తాకట్టు నుంచి విడిపించుకున్న తర్వాత మొదటగా ఆ బంగారం దేవుడి గదిలో ఉంచి పూజించి తిరిగి లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగుపెట్టినందుకు ధన్యవాదాలు తెలిపి దానిని జాగ్రత్త పరుచుకోవాలి. ఇలా బంగారం తాకట్టు పెట్టేటప్పుడు అలాగే తాకట్టు నుంచి విడిపించేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుంది లేదంటే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుస్తుంది.

 

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -