Hyderabad: రోడ్డుపై బంగారం దొరికితే ఈ వ్యక్తి ఏం చేశాడో తెలుసా?

Hyderabad: నేటి సమాజం స్వార్థంతో కూడుకున్నది అని అందరూ అంటారు కానీ స్వార్ధపరులు ఎంతమంది ఉన్నారో అంతకన్నా ఎక్కువ నిస్వార్ధపరులు ఉన్నారు. అలాంటి ఘటనే ఈమధ్య హైదరాబాదులో చోటు చేసుకుంది. మనుషుల్లో ఇంకా మానవత్వం నిలిచి ఉందని నిరూపించే సంఘటన ఇది.

రోడ్డుమీద రూపాయి కాసు కనిపించిన తీసి జేబులో వేసుకునే రోజులు ఇవి. అలాంటిది ఒక వ్యక్తికి ఏకంగా పాతిక లక్షల విలువైన బంగారంతో కూడిన బ్యాగ్ దొరికింది. మరి ఎవరైనా అయితే ఎగిరి గంతేసి ఇంటికి తీసుకుపోయే వారే. కానీ ఆ వ్యక్తి మాత్రం పోయిన వాళ్ళ మానసిక పరిస్థితిని ఆలోచించుకొని నిస్వార్ధంగా ఆ బ్యాగ్ ని పోలీసులకి అప్పగించి వివరాలు ఇచ్చి మరి వచ్చారు.

 

ఇంతకీ విషయం ఏమిటంటే హైదరాబాదు సిటీలోని సంగారెడ్డి జిల్లా బీరంగూడెం కమాన్ దగ్గర ఉన్న సాయి భగవాన్ కాలనీలో నివాసం ఉంటున్నారు నిరూప్ అనే వ్యక్తి. ఈయన ఐటి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు విజయవాడలో తన తమ్ముడు నిశ్చితార్థానికి వెళ్లి తిరిగి బస్సులో హైదరాబాద్ వచ్చారు. ఆ సమయంలోనే ఆయన నగలతో కూడిన బ్యాగ్ ని పోగొట్టుకున్నారు.

 

అదే సమయంలో బీరంగూడెం సమీపంలోని ఆటో స్టాండ్ దగ్గర నగలు ఉన్న బ్యాక్ ని గుర్తించాడు అదే ప్రాంతానికి చెందిన నరేందర్. బ్యాగ్ తెరిచి చూడగా అందులో బట్టలు స్వీట్ ప్యాకెట్స్ తో పాటు నగలు కూడా ఉండడం గమనించాడు. ఆ బ్యాగ్ మీద అడ్రస్ లేకపోయినప్పటికీ ఎంతో బాధ్యతగా తీసుకెళ్లి రామచంద్రపురం పోలీస్ స్టేషన్ కి అప్పగించాడు.

 

బ్యాగ్ ని తీసుకున్న సీఐ సంజయ్ కుమార్ విచారణ చేసి నగలబ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తిని గుర్తించి బ్యాగ్ అందజేశారు. అంతా నిజాయితీగా వ్యవహరించినందుకు నరేందర్ ను పోలీస్ స్టేషన్లో సీఐ సంజయ్ కుమార్ ఇతర పోలీస్ సిబ్బంది సన్మానించారు. బాధితులు కూడా ఎంతో ఆనందంతో నరేందర్ కి కృతజ్ఞతలు తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -