Gold: అక్షయ తృతీయ రోజు బంగారం కొంటున్నారా.. చెయ్యకూడని తప్పులు ఇవే!

Gold: మామూలుగా అక్షయ తృతీయ రోజు వచ్చింది అంటే చాలు మహిళలు పెద్ద ఎత్తున బంగారు నగలు కొనుగోలు చేయడానికి ఆసక్తిని కనబరచడంతో పాటు కొనుగోలు చేస్తుంటారు. అక్షయ తృతీయ రోజు కొంచమైనా పసిడి కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని సంపద వృద్ధి చెందుతుందని నమ్మకం. ఆరోజున మహిళలు బంగారు షాపుల వద్ద పెద్ద మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. బంగారు షాపులలో కూడా అక్షయ తృతీయ కారణంగా డిస్కౌంట్ లను కూడా ఇస్తూ ఉంటారు.

చాలామంది అక్షయ తృతీయ రోజు డబ్బులు లేకపోయినా అప్పు చేసి మరీ అయినా కూడా బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు.కానీ అలా చేయడం వలన బంగారం అక్షయం అవ్వడం అన్నది పక్కన పెడితే అప్పు చేసి బంగారం కొనడం వలన మరిన్ని సమస్యలను కొని తెచ్చుకున్నట్టే అంటున్నారు. అదేలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అక్షయం అంటే ఎప్పటికీ తరగనిది అని అర్థం. అక్షయ తృతీయ రోజున ఉపవాస దీక్ష చేసి ఏ పుణ్య కర్మను ఆచరించినా అక్షయముగా ఫలము లభిస్తుంది.

అక్షయుడైన విష్ణువును పూజిస్తాం కాబట్టి దీనికి అక్షయ తృతీయ అని పేరు వచ్చింది. అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం అంటే పాపం కొనుక్కోవడం అంటున్నారు మన చాగంటి వారు. కలిపురుషుడు బంగారంలో ఉంటాడు. అక్షయ తృతీయ రోజున బంగారం కొనమని ఎవరు చెప్పారో కానీ పురాణాల్లో, శాస్త్రాల్లో ఎక్కడా లేదని వ్యాఖ్యానించారు. ఆ రోజున బంగారం కొనుక్కోవడం పిచ్చి పని. బంగారం కొనడం వలన పాపం వృద్ధి చెందడం తప్ప ఎటువంటి లాభాలు ఉండవని చెప్పారు. మరి అక్షయ తృతీయనాడు ఏం చేయాలి అనేదానికి సమాధానం ఇచ్చారు. స్వయం పాకం, బట్టలు, గొడుగు, ద్రవ్యం అనగా డబ్బు, చెప్పుల జత లాంటివి దానం ఇవ్వాలి తప్ప.బంగారం కొనడం వలన పాపం అక్షయం అవుతుందని తెలిపారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -