Vastu Tips: ఆ వస్తువులు పొరపాటున కూడా చేజారకూడదు.. అవేంటంటే?

Vastu Tips: మామూలుగా మనం చేతిలో పట్టుకున్న కొన్ని వస్తువులు అనుకోకుండా చేజారి పడిపోతూ ఉంటాయి. సరిగా పట్టుకోకపోవడం వల్ల ఎవరైనా తగిలించడం వల్ల ఏదైనా వస్తువు తగిలినప్పుడు అనుకోకుండా మన చేతిలో వస్తువులు జారీ కింద పడి పగిలిపోతూ కూడా ఉంటాయి. నిత్యం పనులు చేసే సమయంలో ఎంత జాగ్రత్తగా వ్యవహరించినా ఏవో వస్తువులు చేజారి కిందపడుతుంటాయి. గాజు, పింగాణి వస్తువుల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉంటారు. అయితే వంటగదిలో వినియోగించే వస్తువుల విషయంలో మాత్రం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అప్పుడప్పుడు జారి కిందపడతుంటాయి.

 

అయితే కొన్ని రకాల వస్తువులు చేతిలో నుంచి జారీ అస్సలు పడిపోకూడదు అంటున్నారు వాస్తు పండితులు. ముఖ్యంగా చేతిలో నుంచి కొన్ని వస్తువులు జారి కింద పడకూడదు. అలా పడితే జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి అంటున్నారు. మరి ఎటువంటి వస్తువులు కింద పడకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఎప్పుడు కూడా చేతిలో. నుంచి పాలు కిందపడకూడదు. ఇలా జరిగితే కుటుంబంలో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడతాయి. మరి గృహప్రవేశం రోజు పాలుపొంగితే మంచిది అంటారు కదా అనే సందేహం రావొచ్చు. అయితే గృహ ప్రవేశం రోజున పాలు పొంగించడం మంచిదే కానీ ఆ తర్వాత పదే పదే పాలు పొంగడం. పాల గిన్నె, గాజులు పడిపోవడం కూడా దురదృష్టానికి సూచన.

ప్రతి ఒక్క వంటింట్లో ఉప్పు తప్పనిసరిగా ఉంటుంది. ఉప్పును లక్ష్మీదేవికి ప్రతిరూపంగా చెబుతారు. శనిబాధలు తొలగించుకునేందుకు దానం కూడా చేస్తారు. అయితే చేతిలోంచి ఉప్పు అకస్మాత్తుగా పడిపోతే రానున్న కొద్ది రోజుల్లో డబ్బుకు కొరత ఏర్పడుతుందని అర్థం. అంటే త్వరలో ఆర్థిక సమస్యలు ప్రారంభమవుతాయని అర్థం. ఇంకొందరికైతే ఉప్పు చేజారిపడితే పతనానకి దగ్గరగా ఉన్నారు అప్రమత్తంగా ఉండమని అర్థం. కడుపు నింపు ఆహార ధాన్యాలైన బియ్యం, గోధుమలు వంటి ధాన్యాలు అస్సలు చేజారకూడదు.

 

అలా జారాయి అంటే అన్నపూర్ణాదేవిని అవమానిస్తున్నట్టే. ఈ సంఘటన ద్వారా ఆ వ్యక్తికి రానున్న రోజుల్లో ఆహార కొరత ఉంటుందని హెచ్చరిక. ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కోక తప్పదు. అందుకే అన్నం తినేముందు మొదటి ముద్దను కళ్లకు అద్దుకుని దేవుడిని నమస్కరించుకుని తింటారు. అలాగే ఎప్పుడు కూడా అన్నం తినేటప్పుడు మధ్యలో చేతులు కడుక్కోరాదు. నల్ల మిరియాలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అవి మీ చేతిలోంచి జారితే రాబోయే రోజుల్లో మీ సన్నిహితులు అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది అని అర్థం. పూజా ఫలకం కిందపడితే టే అస్సలు మంచిది కాదు. అది కుటుంబంలో పెద్ద సంక్షోభానికి హెచ్చరిక.అలాంటి సందర్భాల్లో దేవుడి దగ్గర దీపం వెలిగించి ఆ సంక్షోభాన్ని తొలగించమని భగవంతుడిని ప్రార్థించాలి.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: ఉప్మాకు అమ్ముడుపోవద్దంటూ పవన్ కళ్యాణ్ సెటైర్లు.. ఆ ఉప్మా ఎవరంటే?

Pawan Kalyan:  ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పవన్ కళ్యాణ్ తన ప్రచారం లో జోరు, ప్రసంగాలలో హోరు పెంచుతున్నారు. తనదైన స్టైల్ లో ప్రతిపక్షం వారిని విమర్శిస్తూ కూటమి అధికారంలోకి వస్తే...
- Advertisement -
- Advertisement -