Roja: రాజులకు రోజా ఎర వేస్తున్నారంటూ నెటిజన్ల కామెంట్లు.. అలా చేయడంతో?

Roja: టాలీవుడ్ ప్రేక్షకులకు ఒకప్పుడు తెలుగు సినిమాల్లో టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రోజా గురించి పెద్దగా పరిచయంకర్లేదు. తన చక్కటి నవ్వు, అందంతో ఎంతోమంది అభిమానులను ఆకట్టుకుంది. పలువురు స్టార్ హీరోల సరసన నటించి నటిగా తెలుగు నాట తనకంటూ చెరగని ముద్ర సంపాదించుకుంది. ఇదంతా పక్కన పెడితే ఇటీవలే కృష్ణంరాజు గారు అనారోగ్యం కారణంగా చనిపోయిన సంగతి మన అందరికి తెలిసిందే.

కాగా గురువారం పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు లోని కృష్ణంరాజు స్వగృహంలో ఏర్పాటుచేసిన సంస్మరణ సభకు ఎంపీ రోజా, చెల్లు బోయిన వేణుగోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మొగల్తూరు తీర ప్రాంతంలో కృష్ణంరాజు పేర స్మృతివనం ఏర్పాటు చేయడానికి ఏపీ ప్రభుత్వం రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించిందని రోజా తెలిపిపారు. ఇక రాజకీయాల్లో ఉండి మంచివారు అని పేరు తెచ్చుకోవడం చాలా అరుదు.

ఆ గణత కృష్ణంరాజు గారికి దక్కింది. ఆయన సినిమాల్లోనే రెబల్ స్టార్. ఇక బయట చాలా సున్నిత మనసు కలిగి ఉంటారు. ఆయన వారసుడుగా ప్రభాస్ అడుగుపెట్టి భారతదేశం గర్వించే స్థాయికి ఎదిగాడు. కృష్ణంరాజును ప్రేమించే అందరికీ ఆయనలా ఈ ప్రాంతానికి అండగా ఉండాలని ప్రభాస్ ను కోరుతున్నా.. అని రోజా మాట్లాడారు. ఇక తీర ప్రాంతంలో కృష్ణంరాజు పేర స్మృతివనాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కొందరు ప్రశంసిస్తున్నారు.

కానీ మరి కొందరు మాత్రం విమర్శిస్తున్నారు. అయితే కొందరు వైసీపీ ప్రభుత్వం రాజకీయం చేస్తుంది అని విమర్శిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో రాజుల ఓట్ల కోసమే ఈ ప్రకటన చేశారని వార్తలు వస్తున్నాయి. రోజా మాటలను విన్న కొందరు నెటిజన్లు రాజులకు రోజా ఎరవేస్తుందని కామెంట్లు పెడుతున్నారు. కాగా కృష్ణంరాజు చనిపోవడం మాత్రం సినీ రాజకీయ వర్గాలకు తీరని లోటుగా మారింది. ఇక రోజా మాత్రం కృష్ణంరాజు గారు గురించి బాగానే ప్రశంసించింది.. కానీ నెటిజన్లు మాత్రం రోజా రాజకీయం చేస్తుందని కామెంట్ల రూపంలో దుమ్ము ఎత్తిపోస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -