Munugode By-Poll: మునుగోడు ఉపఎన్నిక ఎప్పుడంటే.. క్లారిటీ ఇచ్చేసిన బీజేపీ జాతీయ నేత

Munugode By-Poll: మునుగోడు ఉపఎన్నిక ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. పార్టీలన్నీ మునుగోడు ఉపఎన్నికపై దృష్టి పెట్టాయి. ఉపఎన్నికల్లో గెలుపొందేందుకు పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్ తో పాటు బీజేపీ ఉపఎన్నికల్లో గెలుపు దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయకముందే పార్టీలన్నీ మునుగోడుపై ఫోకస్ పెట్టాయి. అధికార టీఆర్ఎస్ పార్టీలు మునుగోడులో పలు మండలాలను కొత్తగా ప్రకటించింది. ఇక బీజేపీ, కాంగ్రెస్ మునుగోలోని నేతలు ఇతర పార్టీలవైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకకున్నాయి.

అయితే మునుగోడు ఉపఎన్నిక ఎప్పుడు జరుగుతుందనే దానిపై ఒక క్లారిటీ వచ్చింది. నవంబర్ ఒకటి లేదా రెండో వారంలో మునుగోడు ఉపఎన్నిక జరిగే అవకాశముంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కేంద్రానికి మునుగోడు ఉపఎన్నికపై నివేదిక పంపించింది. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించింది. ఇక కేంద్ర ఎన్నికల కమిషన్ నవంబర్ లో హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికలను నిర్వహించాలని చూస్తోంది. అప్పుడే మునుగోడు ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల చేసే అవకాశముంది. దసరా తర్వాత తర్వాత మునుగోడు ఉపఎన్నిక నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆవీఎంలతో పాటు అవరమైన ఏర్పాట్లు ఈసీ చేస్తోంది.

పోలింగ్ కు అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఎలక్టోరల్ అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇఫ్పటికే నల్గగొండ జిల్లా కలెక్టర్ తో పాటు అధికారులు పోలింగ్ బూత్ లను యాక్టివ్ చేశారు. నవంబర్ రెండో వారంలో ఎన్నికలను నిర్వహించనుండగా.. పోలింగ్ తర్వాత 10 రోజుల్లో ఫలితాలను ప్రకటించనున్నారు. నవంబర్ మొదటి లేదా రెండో వారంలో ఎన్నికలు జరుగుతాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ సునీల్ బన్సల్ స్పష్టం చేశారు. కేంద్రంలో బీజేపీ అగ్రనేతగా ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు.

దీంతో మునుగోడు ఉపఎన్నికలపై ఆయనకు స్పష్టమైన సమాచారం ఉండే ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇక వచ్చే నెలలో మునుగోడు బైపోల్ షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండటంతో దసరా తర్వాత పార్టీలన్నీ జోరు పెంచే అవకాశముంది. ప్రచారాన్ని మరింత ముముర్మం చేయనున్నాయి. జాతీయ అగ్రనేతలతో బీజేపీ, కాంగ్రెస్ ప్రచారం చేయించే అవకాశముంది. ఇక టీఆర్ఎస్ నుంచి కేసీఆర్ మరోసారి బహిరంగ సభ నిర్వహించనున్నారు. దీంతో దసరా తర్వాత మునుగోడు ఉపఎన్నిక హీట్ తారాస్థాయికి చేరుకునే అవకాశముంది.

Related Articles

ట్రేండింగ్

Pithapuram: పిఠాపురంలో ఫుల్ సైలెంట్ అయిన ఓటర్లు.. మద్దతు ఏ పార్టీకి అంటే?

Pithapuram:  ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రత్యర్థుల మీద మాటల దాడి చేస్తూ తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు రాజకీయ నాయకులు. ఆ పార్టీ ఈ పార్టీ అనే కాకుండా ప్రతి పార్టీ వారు తమ...
- Advertisement -
- Advertisement -