Revanth Reddy: ఆ విషయంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి రేవంత్‌ క్షమాపణ!

Revanth Reddy టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్‌ రెడ్డి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి బహిరంగా క్షమాపణ చెప్పారు. ఇటీవల నల్గొండ జిల్లాలో జరిగిన ఓ సభలో ఆ పార్టీ నేత అద్దంకి దయాకర్‌ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని పరుష పదజాలంతో దూషించిన విషయం విదితమే. అయితే తమ పార్టీ నేతల తిట్టకు నైతిక బాధ్యత వహిస్తూ రేవంత్‌ రెడ్డి ఓ వీడియో ద్వారా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి క్షమాపణ చెప్పారు. ఇలాంటి వాఖ్యలు చేయడం సరికాదని ఇలాంటి భాష వాడకూడని రేవంత్‌ సూచిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు.

Revanth Reddy
revanth-reddy-says-sorry-to-komatireddy-venkat-reddy

మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉప ఎన్నికల గురించి తనకు పీసీసీ నుంచి ఎలాంటి సమాచారం లేదని అయితే ఉప ఎన్నిక గురించి తనతో ఏ ఒక్కరూ మాట్లాడాలేదన్నారు. పిలవని పేరంటానికి తానేందుకు వెళ్తానని ఆయన స్పష్టం చేశారు. నల్గొండలో జరిగిన సభలో ఓ పిల్లాడితో తనను తిట్టించారని తనను అవమానించేలా మాట్లాడించిన వారు తనకు బహిరంగా క్షమాపణ చెప్పాలని కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

సీనియర్‌ అయిన తనను తిట్టిన వారిని వెంటనే పార్టీ నుంచి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. దీనికి తోడు కాంగ్రెస్‌ పాదయాత్ర గురించి కూడా తనన పిలవలేదని ఇన్ని సార్లు అవమానించిన వారి వద్దకు ఎలా వెళ్తానని కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి పేర్కొన్నారు. దీనంతటికి పార్టీ అధ్యక్షుడిగా బాధ్యత వహిస్తూ రేవంత్‌ రెడ్డి విడుదల చేసిన క్షమాపణ వీడియోపై కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి ఎలా స్పందిస్తారో అందరూ చర్చించుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -