Family Politics: తెలంగాణ రాష్ట్రంలో ఫ్యామిలీ ప్యాకేజీ పాలిటిక్స్.. ఈ రాజకీయాలు ఆ పార్టీకి మేలు చేస్తాయా?

Family Politics: సాధారణంగా ఏ రంగంలోనైనా వారసుల పరంపర కొనసాగడం సర్వసాధారణం. సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా రాజకీయాలలో కూడా ఈ వారసుల పరంపర కొనసాగుతుంది. ఇప్పటికే ఎంతోమంది సీనియర్ రాజకీయ నాయకుల తమ వారసులకు టికెట్ ఇవ్వాలని డిమాండ్లు చేయడమే కాకుండా కొంతమంది ఫ్యామిలీ ప్యాకేజ్ లాగా ఫ్యామిలీ మొత్తం టికెట్లు అందుకుంటూ రాజకీయాలలో కొనసాగుతూ ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణలో ఇలా ఫ్యామిలీ ప్యాకేజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి.

గత నెల రోజులుగా నాలుగు కుటుంబాలు పార్టీలు మారాయి. ఆ నాలుగు రాజకీయ నేపథ్యంలో కుటుంబాలు కూడా రాజకీయ వారసత్వం కోసం కుటుంబ సభ్యులకు పార్టీలు మారిన పరిస్థితి తెలంగాణలో చోటుచేసుకుంది.మహేందర్ రెడ్డి ఈయన భార్యకు ఎంపీ టికెట్ కోసం BRS ను వీడి కాంగ్రెస్‌లో చేరిపోయారు. తమ్ముడు పార్టీ మారకపోయిన ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఉన్న కండువా కప్పుకోకుండా భార్యకు మాత్రం కాంగ్రెస్ కండువా కప్పారు.

వికారాబాద్ జెడ్పీ చైర్మన్ గా ఉన్న సునీత మహేందర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ మల్కాజిగిరి ఎంపీ టికెట్ కట్టబెట్టింది. తన భార్యా కోసం రెండు సార్లు మంత్రి పదవి ఇచ్చినా కూడా ఈయన బిఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారు.మరో సీనియర్ నేత కే కేశవరావు. 50 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న కేశవరావు. రాజకీయ ప్రస్థానం మొత్తం కాంగ్రెస్ పార్టీ కానీ ఉద్యమ సమయంలో ఆయన బీఆర్ ఎస్ పార్టీలో చేరారు. కెసిఆర్ కేకేకు రాజ్యసభ, ఆయన కొడుకుకు కార్పొరేషన్ చైర్మన్, ఆయన కూతురుకి హైదరాబాద్ మేయర్‌గా అవకాశం కల్పించారు.

హైదరాబాద్ మహానగర మేయర్‌గా ఉన్నారు కూతురు విజయలక్ష్మి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేస్తుండడంతో ఆస్థానం ఖాళీ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇలా ఈమెకు సీటు లేకపోవడంతో ఈమె కాంగ్రెస్ పార్టీలోకి చేరి పార్టీ తరపున ఖైరతాబాద్ నుంచి పోటీ చేయబోతున్నారని తెలుస్తోంది.

తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసే తెలంగాణ వచ్చాక టీఆర్ఎస్ పార్టీలో ఉపముఖ్యమంత్రిగా పని చేసిన కడియం శ్రీహరి రేవంత్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు అయితే ఈయన చివరికి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఎలా పార్టీలోకి వచ్చి రాగానే ఈయన ఎంపీ సీటు కోసం ప్రయత్నాలు చేయడమే కాకుండా కూతురు కావ్య రాజకీయ ఆరంగ్రేటం కోసమే ఆయన సుదీర్ఘ రాజకీయాల్లో ఎన్నో విమర్శలు ఎదుర్కొంటూ పార్టీ మారారు ఇలా తెలంగాణలో రాజకీయ నాయకులు ఫ్యామిలీ ప్యాక్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -