ఒకరిద్దరు లుచ్చాగాళ్ళ ఫోన్లు టాప్ చేసి ఉండొచ్చు.. కేటీఆర్ కామెంట్లతో నిజాలు తెలిసిపోయాయిగా!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదంలో వెంట్రుక లాగితే డొంక కలుగుతోంది. ప్రతిరోజు పేరు తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. గురువారం మరో ఇద్దరు పోలీసులను విచారణ బృందం అదుపులోకి తీసుకుంది. వారిలో టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్ తోపాటు యిన్స్‌పెక్టర్ గట్టుమల్లును బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరినీ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ప్రణీత్‌రావుతో సంబంధాలపై దర్యాప్తు బృందం ఆరా తీస్తోంది. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు విచారణ బృందం ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదిలిపెట్టడం లేదు. బుధవారం రాత్రే వాళ్లను అదుపులోకి తీసుకున్న వీరిద్దరిని దర్యాప్తు అధికారులు పలు కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. విచారణలో భాగంగా ఓఎస్డీ రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ను అధికారులు రికార్డ్ చేశారు. విచారణ బృందం అదుపులో ఉన్న మరో అధికారి గట్టుమల్లు టాస్క్ ఫోర్స్ లో సీఐగా పనిచేశారు. రాధాకిషన్ రావు, సీఐ గట్టుమల్లు ఇద్దరూ కలిసి వ్యాపారులు, రాజకీయ నేతలను ఫోన్ ట్యాపింగ్ డేటాతో బెదిరించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ బెదిరింపుల విషయమై దర్యాప్తు బృందానికి ఇప్పటికే పలు ఫిర్యాదులు కూడా అందాయి.

మరోవైపు పోలీసుల విచారణలో మరో సీనియర్ అధికారి గోనె సందీప్ పేరు బయటకొచ్చింది. సైబరాబాద్‌ SOTలో ఓఎస్డీగా గోనె సందీప్‌ పనిచేశారు. ప్రస్తుతం నాన్‌ కేడర్‌ ఎస్పీ హోదాలో ఉన్నారాయన. పోలీసుల విచారణలో గోనె సందీప్ పేరును ప్రణీత్‌రావు చెప్పారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఆయన పాత్రపై ఆరా తీస్తున్నారు. సైబరాబాద్ పరిధిలో భారీగా వసూళ్లు చేసినట్లు గోనె సందీప్‌పై ఆరోపణలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వివాదాల్లో తలదూర్చినట్లు గతంలో ఫిర్యాదులు అందాయి. సెటిల్మెంట్లు చేయడం ద్వారా కోట్ల రూపాయలు వెనకేసినట్లు అనుమానిస్తున్నారు. సైబరాబాద్ పరిధిలో వ్యాపారవేత్తలను బెదిరించి.. డబ్బు వసూలు చేసినట్లు గోనె సందీప్‌పై ఆరోపణలు వచ్చాయి. అయితే.. ఆయన మాజీ రాజ్యసభ ఎంపీ సంతోష్‌రావు తోడల్లుడు కావడంతో.. ఉన్నతాధికారులు చూసీచూడనట్లు వ్యవహరించారు. తీవ్రమైన ఆరోపణలు వచ్చినా కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.

ఇవన్ని పక్కన పెడితే.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. మల్కాజ్ గిరి సెగ్మెంట్ నేతలతో భేటీ సందర్భంగా కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చేస్తే గీస్తే… ఒకరిద్దరు లుచ్చాల ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చిన అన్నారు. అయినా అది పోలీసుల పని అంటూ మాట్లాడారు. దాంతో మాకేంటి సంబంధం అని అన్నారు. అయితే, దొంగలో.. లుచ్చాలో ఫోన్లు ట్యాప్ కాలేదు. ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేశారు. 2014 ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేసి ఓటుకు నోటు కేసులో ఇరికించారు. అక్కడి నుంచి మొదలైన ట్యాపింగ్ లో ప్రతిపక్షనేతలంతా టార్గెట్ అయ్యారు.

రేవంత్ రెడ్డి తర్వాత రెండో బాధతుడిని నేనేనని రఘునందన్ రావు అన్నారు. అలా చాలా మంది తమ ఫోన్లు ట్యాప్ అయ్యాయని బయటకు వస్తున్నారు. వీరింత దొంగలో .. లుచ్చాలో కాదు. సమాజంలో ఓ స్థాయిలో ఉన్నవారు. అలాంటి వారి ఫోన్లు ట్యాప్ చేయడం నేరం. అధికారులు ట్యాప్ చేసినా.. దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. మంచి జరిగితే కేసీఆర్, కేటీఆర్ క్రెడిట్ తీసుకొని.. చెడు జరిగితే అధికారులపై నెట్టివేయడం సరికాదు. కాళేశ్వరం ఇంజనీర్ అని మొదట్లో బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ, మేడిగడ్డ కుదుపు తర్వాత.. అది ఇంజనీర్ల పొరపాటు అని నెట్టివేసే ప్రయత్నం చేశారు. ఇలా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినా.. జరిగే పని కాదు. ఈ కేసులో కేటీఆర్ కూడా జైలుకు వెళ్లినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని చాలా మంది చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -