Surekha Vani: నటి సురేఖా వాణికి పెళ్లి చేసేద్దామంటున్న కూతురు సుప్రిత

Surekha Vani నటి సురేఖా వాణి అంటే తెలియనివారుండరు.. సినిమాల్లో కొన్ని పాత్రల్లో ఆమె ప్రేక్షకులను అలరించడమే కాదు.. సోషల్ మీడియాలోనూ ఆమెకు ప్రత్యేక ఫాలోయింగ్ ఉంది. ఆమె కూతురు సుప్రిత కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. సురేఖా వాణి అయితే.. తన వయస్సును కూడా మరిచి కూతురుతో కలసి ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఇటీవలే సుప్రిత బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ సోషల్ మీడియా అంతా వైరల్‌ అయ్యాయి.

అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వీరిద్దరూ తమ పర్సనల్ విషయాల గురించి.. ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. పెళ్లి గురించి, తమ బాయ్ ఫ్రెండ్‌కు ఉండాల్సిన లక్షణాలు గురించి సురేఖ వాణి చెప్పారు. త్వరలో సురేఖా వాణి మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారా..? అంటూ నిఖిల్‌ ప్రశ్నించాడు. అందుకు సురేఖా వాణి No అనే బోర్డు చూపించగా.. ఆమె కూతురు సుప్రిత మాత్రం YES అనే బోర్డు చూపించింది. అంతేకాదు “చేసేద్దాం సింగిల్‌‌గా ఎలా ఉంటుంది. అలా ఉంటే నా బుర్ర తింటూ ఉంటుంది..” అంటూ కామెంట్‌ చేసింది. సురేఖా వాణి మాత్రం అలాంటి ఉద్దేశం లేదని క్లారిటీ ఇచ్చింది.

Surekha Vani
surekha-vani-daughter-supritha-want-to-do-marriage-to-her-mother

వీరి సంభాషణ అక్కడితో ఆగలేదు. బాయ్ ఫ్రెండ్‌ విషయంలో నిఖిల్‌ మరో ప్రశ్న అడిగాడు.‘మీరిద్దరూ సింగిలేనా?’ అంటూ తల్లీకుమార్తెలను ప్రశ్నించగా.. ఇద్దరూ YES చెప్పారు. ఎలాంటి బాయ్‌ ఫ్రెండ్‌ కావాలని కోరగా.. నన్ను భరిస్తే చాలంటూ సుప్రిత సమాధానం చెప్పగా.. సురేఖా మాత్రం తనకు కావాల్సిన బాయ్ ఫ్రెండ్‌‌కు ఆరు క్వాలిటీస్‌ ఉండాలంది. ఆరడగులు ఎత్తు ఉండాలి. మంచి కలర్‌, బాగా డబ్బు ఉండాలి, బాగా చూసుకోవాలి, లైట్‌‌గా గడ్డం కూడా ఉండాలని చెప్పుకొచ్చింది.

దీంతో సురేఖా వాణికి ఎవరైనా బాయ్ ఫ్రెండ్‌ ఉన్నారా..? లేక ఎవరైనా వన్‌ సైడ్‌ ట్రై చేస్తున్నారా..? అనుమానాలు వస్తున్నాయి. అయితే ఈ విషయంలో నిఖిల్ కూడా ఎవరైనా ఉన్నారా..? అని అడగ్గా లేరంటూ సురేఖా సమాధానమిచ్చింది. ప్రస్తుతం వీరితో నిఖిల్ చేసిన ఇంటర్వ్యూ యూట్యూబ్‌లో వైరల్‌ అవుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -