Unstoppable Season 2: అన్ స్టాపబుల్2 ఏదో తేడా కొడుతోందే.. ఫ్లాపైతే బాలయ్యకు కష్టమేనా?

Unstoppable Season 2: టాలీవుడ్ ప్రేక్షకులకు నందమూరి బాలకృష్ణ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం యువ హీరోలతో సమానంగా ఆయన సినిమా అవకాశాలు అందుకుంటూ తెలుగు ఇండస్ట్రీలో అగ్రస్టార్ హీరోగా వెలుగుతున్నాడు. ఇక బాలయ్య అన్ స్టాపబుల్ అనే టాక్ షో గతంలో మొదలుపెట్టారు. ఈ షో మొదటి ఎపిసోడ్ ఎప్పుడు మొదలైందో అప్పటినుంచి ఆ షోకి బాగా క్రేజ్ పెరిగిపోయింది.

ప్రతి ఎపిసోడ్ ను బాలయ్య తన అద్భుతమైన మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మొత్తంగా బాలయ్య అన్ స్టాపబుల్ షో బాగానే క్లిక్ అయింది. ఇప్పుడు అన్ స్టాపబుల్ సీజన్ 2 త్వరలో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ సీజన్ వచ్చిన తర్వాత బాలకృష్ణకు వెండితెరపై ఇటు బుల్లితెరపై బాగానే క్రేజ్ పెరిగిపోయింది. కాగా ఇప్పుడు సీజన్ 2 కోసం భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారట. టాలీవుడ్ హిస్టరీలోనే ఓటీటీ కార్యక్రమానికి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది.

ఈ ఈవెంట్ కి దాదాపు 30 వేల మందికి పైనే జనాలు వస్తారన్నట్లు తెలుస్తుంది. కాగా ఈ భారీ సభకు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో ఈ సీజన్ టు ట్రైలర్ షూట్ చేసినట్లు తెలుస్తుంది. ఆ షూట్ లో బాలయ్య డిఫరెంట్ గెటప్ లో పాల్గొన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ షో విషయంలో ఆహా నిర్వాహకులు మరింత హడావిడి చేస్తున్నారు. అయితే ప్రేక్షకుల్లో మాత్రం సీజన్ వన్ కి ఉన్న స్థాయిలో సీజన్ టు పై అంచనాలు లేవు.

ఇక భారీ ప్రమోషన్ లు అన్ స్టాప్ ఫుల్ సీజన్ టు షో కు మైనస్ కావచ్చని కొంతమంది కామెంట్లు రూపంలో తెలియజేస్తున్నారు. కానీ ఆహా ఓటీటీ మాత్రం ఎక్కడ తగ్గకుండా మరో స్థాయిలో ప్రమోషన్లు చేస్తుంది. మరి అన్ స్టాపబుల్ 2 షో ద్వారా బాలయ్య ప్రేక్షకులు ఏ విధంగా ఆకట్టుకుంటాడో చూడాలి. కానీ ఈ షో మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోకపోతే బాలయ్య ఫ్యాన్స్ నిరాశ చెందాక తప్పదు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -