Swami Paripoornananda: బాలయ్యకు పోటీగా నిలబడుతున్న స్వామీజీ.. కంచుకోటలో రిస్క్ అవసరమా?

Swami Paripoornananda: హిందూపురం నియోజకవర్గం నందమూరి కుటుంబానికి కంచుకోట. ఆ నియోజకవర్గ నుంచే ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ ఆరుసార్లు గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. ఆ నియోజకవర్గ నుంచి పోటీ చేస్తే బాలకృష్ణకి ఓటమి ఉండదు అనే ముద్ర పడిపోయింది. 2014లో బాలయ్య కి పోటీగా నిలబడిన నవీన్ నిశ్చల్ పోటీలో ఓటమిపాలయ్యారు. 2019లో కూడా బాలయ్యదే గెలుపు. ఇక ఇప్పుడు కూడా బాలకృష్ణ హ్యాట్రిక్ విజయం సాధిస్తారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు కారణం వైసీపీలో వర్గ పోరు అంటున్నారు. నిజానికి వైసీపీలో కోఆర్డినేషన్ మిస్సయింది, అది బాలయ్యకి వరంగా మారింది.

అయితే ఈసారి హిందూపురం ప్రజలు బాలయ్య మీద కూడా వ్యతిరేకతను చూపిస్తున్నారు. ప్రజలకి అందుబాటులో ఉండటం లేదనేది వారి వాదన. వైసీపీ సరి అయిన క్యాండిడేట్ ని పెడితే ఈసారి బాలయ్య ఓడిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇదే తరుణంలో బీజేపీ శ్రీ పీఠం వ్యవస్థాపకులు పరిపూర్ణానంద స్వామిని రంగంలోకి దించుతున్నారు.పరిపూర్ణానంద స్వామి ఎప్పటినుంచో బీజేపీ నాయకుడు, పైగా ఆయన హిందూపురం ఎంపీ టికెట్ ని ఆశించారు అయితే స్వామికి పెద్ద షాకే ఇచ్చారు బీజేపీ నాయకులు.

హిందూపురంలోనే బీజేపీ కి గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అయినా తిరుపతి, రాజంపేట కోరుకున్నారు ఏపీ బీజేపీ నేతలు. హిందూపురం నుంచి పోటీ చేయాలని స్వామి ఎప్పటినుంచో అనుకుంటున్నారు. అయితే వారికి టికెట్ దక్కకుండా టీడీపీ, బీజేపీ పెద్దలు అడ్డుపుల్ల వేశారని తెలుసుకున్న స్వామి మరింత మొండిగా ఎట్టి పరిస్థితులలోనూ హిందూపురం ఎంపీగా పోటీలో ఉంటానని ప్రకటించారు. అన్నట్లుగానే ఆయన నామినేషన్ దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

ఇండిపెండెంట్ గానే పోటీ చేయబోతున్నారు పరిపూర్ణానంద స్వామి. నిజానికి పరిపూర్ణానంద స్వామి కి భక్తులు, అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. ఆయన పోటీ చేస్తే గెలవటం విషయం పక్కన పెడితే ఖచ్చితంగా ఓట్లు మాత్రం చీలిపోతాయి.ఈ విషయంలో కంగారు పడిన చంద్రబాబు స్వామిని పిలిపించి మాట్లాడారని, కానీ చంద్రబాబు ప్రలోభాలకు స్వామి లొంగలేదని, హిందూపురం అసెంబ్లీకి స్వామి పోటీ చేయబోతున్నారని సమాచారం. మొత్తానికి పరిపూర్ణానంద స్వామి బాలయ్యకి గట్టి పోటీ ఇచ్చేలాగే ఉన్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -