Hindupur: హిందూపూర్ లో ఇప్పటికే డౌన్ అయిన వైసీపీ.. బాలయ్యకు హ్యాట్రిక్ సాధించడం సులువేనా?

Hindupur: హిందూపురం నియోజకవర్గం టిడిపికి కంచుకోట అనే విషయం మనకు తెలిసిందే. ఈ పార్టీ ఆవిర్భావం అయినప్పటి నుంచి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన సందర్భాలే లేవు. ఇలా హిందూపురం నియోజకవర్గంలో ఈ ఎన్నికలలో కూడా మరోసారి టిడిపి విజయకేతనం ఎగరవేయడానికి సిద్ధమవుతోంది.

హిందూపురం నియోజకవర్గం నుంచి టీడీపీ పార్టీ తరఫున సినీ నటుడు బాలకృష్ణ గత రెండుసార్లు పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఇక 2019 ఎన్నికలలో కూడా జగన్మోహన్ రెడ్డి వేవ్ తట్టుకొని ఈయన అఖండ మెజారిటీ సాధించారు. ఎన్నికలలో కూడా బాలయ్య విజయం ఖాయమని తెలుస్తుంది. గత ఎన్నికలలో పోటీ చేసినటువంటి ఇక్బాల్ కి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వకపోవడంతో ఈయన కాస్త చంద్రబాబు నాయుడు సమక్షంలో టిడిపి పార్టీలోకి చేరారు.

ఇక హిందూపురం నియోజకవర్గం నుంచి బీసీ మహిళ దీపికా రెడ్డి అనే కొత్త అభ్యర్థికి టికెట్ ఇవ్వడంతో వైసీపీలో అసమ్మతి నెలకొంది. ఈ క్రమంలోనే సొంత పార్టీ నేతల మధ్య సఖ్యత లేకపోవడంతో వైసిపి డౌన్ అయిందని ఇది టిడిపికి ప్లస్ పాయింట్ అయిందని చెప్పాలి. ఇలాంటి సమయంలోనే హిందూపురం బాధ్యతలను మొత్తం జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇచ్చారు.

అక్కడ పరిస్థితుల్లో దృష్ట్యా పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసిన సక్సెస్ కాలేకపోతున్నారు. హిందూపురంలో వైసిపి జెండా పాతడం కోసం పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేస్తున్న ఫలితాలు మాత్రం టిడిపికే అనుకూలంగా ఉన్నాయని తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Assembly Election: ఏపీలో అక్కడ గెలిస్తే మంత్రి పదవి పక్కా.. ఈ నియోజకవర్గం ప్రత్యేకతలు ఇవే!

Assembly Elections: రాష్ట్రంలోని అతిపెద్ద నియోజకవర్గాలలో మైలవరం నియోజకవర్గం ఒకటి. ముందు ఈ నియోజకవర్గం కమ్యూనిస్టు పాలనలో ఉండేది, తర్వాత తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది. తెదేపా ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు...
- Advertisement -
- Advertisement -