Jagan Graph: ప్రజల హృదయాల్లో కూటమి.. గ్రాఫిక్స్ ప్రచారంలో వైసీపీ.. జగన్ గ్రాఫ్ డౌన్ అవుతోందా?

Jagan Graph: వైసీపీ ప్రభుత్వం ప్రజలని మోసం చేయడంలో నూతన పోకడలను అవలంబిస్తోంది. పార్టీలకు రాని జనాన్ని వచ్చినట్లుగా ప్రజలను మభ్యపెడుతోంది. ఒకవైపు కూటమి వర్గాల నేతలు అందరూ రాష్ట్ర మొత్తం తిరిగి విస్తృతంగా ప్రచారం చేస్తుంటే మరొకవైపు వైసీపీ ప్రభుత్వం మాత్రం గ్రాఫిక్స్ ని నమ్ముకుంటుంది. జగన్ రెడ్డికి గాయమైన తర్వాత జనం వెల్లువలా వచ్చారని టీవీలలో చూపించారు కానీ వాస్తవానికి బయట ఆ పరిస్థితి కనిపించలేదు. ఇదే విషయంగా సజ్జల రామకృష్ణారెడ్డి కొడాలి నాని పై విరుచుకు పడినట్లు వైసీపీ వర్గాలే చెబుతూ ఉండడం గమనార్హం.

వైసీపీ యాక్టివిటీ నీలి కూలీ మీడియాలోనే తప్ప మరెక్కడా కనిపించడం లేదు. ఆ మీడియా యే బస్సు యాత్ర పేరుతో ఏపీ బస్సులో కూర్చుని ప్రయాణిస్తున్న జగన్ కి జననీరాజనం అంటూ టీవీలో గ్రాఫిక్స్ లు వేస్తున్నారు. కానీ నిజానికి చాలా చోట్ల వైసీపీ అభ్యర్థులు ప్రచారంలో జోరు తగ్గించారు. గుంటూరు వంటి చోట్ల 50 కోట్లకు పైగా ఖర్చు పెట్టుకున్న అభ్యర్థులు రానురాను పరిస్థితులు అనుకూలంగా కనిపించకపోవడంతో జాగ్రత్త పడుతున్నారు.

ఇతర పార్టీ నేతలకు భారీగా ఆఫర్లు చేసి పార్టీలో చేర్చుకోవడానికి వైసీపీ ప్రయత్నిస్తూ ఉండటంతో తమకి కూడా ఆ ప్యాకేజీ కావాలని పట్టుపడుతున్నారు, లేనిపక్షంలో అలకపాన్పు ఎక్కుతున్నారు. గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇంకా బస్సు యాత్రలోనే ఉన్న జగన్ ఇంకా పది రోజులు బస్సు యాత్రలో ఉండే అవకాశాలే కనిపిస్తున్నాయి. మధ్యలో పులివెందులలో నామినేషన్ కి కూడా వెళ్లాల్సి ఉంది. అయితే జగన్ కి రోజు మార్చి రోజు సెలవు తీసుకుని అలవాటు ఉండటంతో జగన్ ప్రభుత్వం పూర్తిగా ప్రచారం కోసం గ్రాఫిక్స్ మీదే డిపెండ్ అయినట్లు తెలుస్తోంది.

అయితే ప్రచారాల విషయంలో ఎన్డీఏ కూటమి చాలా చురుగ్గా వ్యవహరిస్తోంది. నందమూరి బాలకృష్ణ రాయలసీమలో స్వర్ణాంధ్ర సహకార యాత్ర అన్స్టాపబుల్ గా నిర్వహిస్తున్నారు. ఆయన సభలకు జనం పోటెత్తుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అయితే రోజుకి రెండు నువ్వు మూడు నియోజకవర్గాలలో పర్యటిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Tuni Assembly Constituency: తుని నియోజకవర్గంలో కూటమికి తిరుగులేదా.. యనమల కుటుంబానిదే విజయమా?

Tuni Assembly Constituency: తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో కూటమిలో కాస్త ఆ నియోజకవర్గం సీటు ఎవరిదనే విషయంపై కాస్త గందరగోళం ఉండేది. అయితే పంపకాలలో తుని నియోజకవర్గం తెదేపాకి దక్కింది. ఈ...
- Advertisement -
- Advertisement -