Rashmika Mandanna: ఆ కిస్ సీన్ల వల్ల నిద్రలేని రాత్రులు గడిపాను.. రష్మిక సంచలన వ్యాఖ్యలు?

Rashmika Mandanna: తెలుగు ప్రేక్షకులకు అందాల భామ రష్మిక మందన్న గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఛలో సినిమా తో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ కన్నడ బ్యూటీ.. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులతో ఊహించని స్థాయిలో మంచి ర్యాపో పెంచుకుంది. ఈ క్రమంలోనే కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ అమ్మడు. ఆ తర్వాత వచ్చిన గీత గోవిందం సినిమాతో ప్రేక్షకులను మరో స్థాయిలో ఆకట్టుకుంది.

తన ప్రత్యేకమైన అందం, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అప్పటినుంచి వరుస సినీ ఆఫర్లు సొంతం చేసుకుంటూ తెలుగు ఇండస్ట్రీలో నటిగా తనకంటూ గుర్తింపు సంపాదించుకుంది. ఇక రష్మిక నటించిన సినిమాలతో పాటు ఆమె చేసిన కిస్ సీన్లు కూడ తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. కానీ ఈ విషయంలో ఆమె సొంత రాష్ట్రంలో మాత్రం ఆగ్రహాలు పుట్టించాయి. డియర్ కామ్రేడ్ సినిమాలో రష్మిక చేసిన కిస్ సీన్ కన్నడ ప్రేక్షకులకు ఏమాత్రం నచ్చలేదు.

అప్పటికే ఈమెకు నిశ్చితార్థం జరిగింది. రష్మిక తెలుగులో ఇలాంటి సీన్లు చేయడంతో కన్నడ ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. ఆ తర్వాత రష్మిక నిశ్చితార్థం కూడా చెడిపోయింది. దాంతో తెలుగులో ఇలాంటి సీన్లు చేయడం వలనే ఆమె నిశ్చితార్థం చెడిపోయిందని చాలామంది విమర్శించారు. అప్పుడు ఆమెపై వచ్చిన విమర్శలకు ఆమె చాలా ఇబ్బంది పడిందని రష్మిక తెలిపింది. ఇక తనపై వచ్చిన ట్రోల్స్ కు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపిందట.

ఈ విమర్శల వలన తను చాలా రోజుల వరకు డిప్రెషన్ లోకి వెళ్లిందని తెలిపింది. అంతేకాకుండా రాత్రిళ్ళు దిండిలో మొహం పెట్టి ఏడ్చానని రష్మిక మందన చెప్పుకువచ్చింది. ఇక ఇదంతా పక్కన పెడితేరష్మికకు మాత్రం పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్లు అందుకుంటూ కెరీర్ పరంగా బిజీగా ఉంది. అంతేకాకుండా ఈమె పలు బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Nara Chandrababu Naidu: చంద్రబాబు స్టామినాకు ఫిదా అవ్వాల్సిందే.. ఏడు పదుల వయస్సులో చెలరేగిపోతున్నారుగా!

Nara Chandrababu Naidu:  ఏపీలో ఎన్నికలవేళ పార్టీ ప్రచారాల జోరు ఊపందుకున్న నేపథ్యంలో అందరి దృష్టి చంద్రబాబు నాయుడు మీద పడటం గమనార్హం. చంద్రబాబు నాయుడు లో అంత ప్రత్యేకత ఏముంది అనుకుంటున్నారా.....
- Advertisement -
- Advertisement -