YSRCP MLA’s: మూడు రాజధానుల వేడి మరింత పెంచేసిన వైసీపీ.. రాజీనామాల పేరుతో కొత్త డ్రామా

YSRCP MLA’s:  ఏపీలో మూడు రాజధానుల అంశం రాజకీయంగా కాక రేపుతోంది. రాజధానిగా అమరావతిని ఉంచాలంటూ రాజధాను రైతులు అమరావతి నుంచి అరసవెల్లికి పాదయాత్ర చేస్తుండటం, రైతుల పాదయాత్రకు ఆటంకం కలిగించేందుకు వారికి వ్యతిరేకంగా వైసీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం దుమారం రేపుతోంది. రైతుల పాదయాత్రపై ఏపీ మంత్రులు చేస్తున్న తీవ్ర వ్యాఖ్యలను తీవ్ర కలకలం రేపుతోన్నాయి. రైతులు పాదయాత్ర చేస్తున్న క్రమంలో మూడు రాజధానులుగా మద్దతుగా వైసీపీ మరో ప్లాన్ వేసింది. రౌండ్ టేబుల్ సమావేశాలతో స్పీడ్ పెంచింది.

ఇటీవల వైసీపీలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించగా.. త్వరలో అమరావతి రైతుల పాదయాత్రకు పోటీగా విశాఖలో మూడు రాజధానులకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహిస్తామని వైసీపీ చెబుతోంది. వైసీపీ నాన్ పొలిటికల్ జేఏసీ పేరుతో ఒక వేదికను ఏర్పాటు చేసింది. వైసీపీ పార్టీ పేరు మీద చేస్తూ సరైన మైలేజ్ రాదని భావించి నాన్ పొలిటికల్ జేఏసీ మీద మూడు రాజధానులకు మద్దతుగా ర్యాలీగా నిర్వహించాలని భావిస్తోంది. అంతేకాదు మూడు రాజధానులకు మద్దతుగా రాజీనామాలు చేసేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు రెడీ అయిపోయారు. మూడు రాజధానులకు మద్దతుగా అవసరైతే రాజీనామా చేస్తానంటూ మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు.

ఇ వక మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు కూడా ఇదే ప్రకటన చేశారు. ఇక చొడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అయితే ఏకంగా రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్ లో జేఏసీకి అందించారు. ఇక గుడివాడ అమర్ నాధ్ కూడా అవసరమైతే మూడు రాజధానులుగా మద్దతుగా రాజీనామ చేసేందుకు సిద్దమని, వచ్చే ఎన్నికల్లో మూడు రాజధానుల రిఫరెండెంగా తీసుకుంటామన్నారు. ఇక నాన్ పొలిటికల్ జేఏసీ ఉత్తరాంధ్ర జిల్లాలో తిరుగుతూ మూడు రాజధానులకు మద్దతుగా నిలుస్తోంది. గ్రామస్థాయి వరకు వికేంద్రకరణ ఉద్యమాన్ని తీసుకెళ్లాలని భావిస్తోంది.

ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో అమరావతి రైతలు పాదయాత్ర కొనసాగుతోంది. త్వరలో ఉత్తరాంధ్రలో పాదయాత్ర అడుగుపెట్టనుంది. కానీ ఉత్తరాంధ్రకు చెందని మంత్రులు తాము అడుగుపెట్టనివ్వబోమని ప్రకటనలు చేస్తున్నారు. అడ్డుకుుని తీరుతామని సవాళ్లు విసురుతున్నారు. దీనికి పోటీగా నాన్ పొలిటికల్ జేఏసీ మూడు రాజధానులకు మద్దతుగా పాదయాత్ర చేస్తామని చెబుతోంది. దీంతో ఉత్తరాంధ్రలో అమరావతి రైతుల పాదయాత్రలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకునే అవకాశం ఉంందని చెబుతున్నారు. ఇక అమరావతికి మద్దతుగా టీడీపీ నేతలు రాజీనామాకు సిద్దమా అంటూ వైసీపీ సవాల్ చేస్తోంది. దీని ద్వారా టీడీపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తోందని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -