Munugode bypoll: మునుగోడులో ఓటుకు రూ.30 వేల నుంచి రూ.40 వేలు.. అందుల నిజమెంత?

Munugode bypoll: మునుగోడు ఉపఎన్నిక అన్ని పార్టీలకు కీలకంగా మారింది. ఇక్కడ గెలుపొందేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. నోటిఫికేషన్ రిలీజ్ కావడం, నామినేషన్ ప్రక్రియ మొదలుకావడంతో పార్టీలన్నీ మరింత జోష్ పెంచాయి. పార్టీల మధ్య విమర్శలు, ఆరోపణల యుద్దం కూడా హీటెక్కింది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. ప్రచారంలో దూసుకెళ్తూ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. పార్టీలన్నీ ఓటర్లకు తాయిలాలు ప్రకటిస్తున్నాయి. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తు్నట్లు ప్రచాంర జరుగుతోంది.

మొన్న దసరా పండుగ సందర్భంగా అన్ని పార్టీలు ఓటర్లకు కేజీ మటన్ తో మద్యం సరఫరా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అన్ని పార్టీలు పోటీ పడి మరీ ఓటర్లకు డబ్బులు ఆఫర్ చేస్తున్నాయి. ఒక పార్టీ రూ.వెయ్యి ఇస్తే మరో పార్టీ రూ.2 వేలు ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఓటుకు రూ.30 వేల నుంచి రూ.40 వేలకు ఇస్తున్నాయంటూ చేసిన ఆరోపణలు కలకలం రేపుతోన్నాయి. ఇది నిజమేనా… పార్టీలు నిజంగా అంత ఇస్తున్నాయా అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు.

మునుగోడులో డబ్బుల పంపకంపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని, ఈసీ చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. కానీ రేవంత్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్, బీజేపీ మండిపడుతున్నాయి. ఎన్నికల ప్రక్రియను పక్కదారి పట్టించేందుకు రేవంత్ రెుడ్డి ప్రయత్నిస్తున్నారని, ఆయన వ్యాఖ్యల వెనుక వ్యూహం ఇదేననే చర్చ జరుగుతోంది. ఉద్దేశపూర్వకంగానే రేవంత్ వ్యాఖ్యలు చేస్తున్నారని చెబుతున్నారు. అంత డబ్బులను ఎవరు పంచుతున్నారో చెప్పాలని బీజేపీ, టీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్,టీఆర్ఎస్ కలిసి ఆడుతున్న నాటకంగా బీజేపీ ఆరోపిస్తుంది.

ఇటీవల హుజూరాబాద్ ఎన్నికలో ఓటుకు రూ.10 వేలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దేశంలోన అత్యంత ఖరీదైన ఉపఎన్నికగా అది రికార్డు సృష్టించినట్లు ప్రచారం జరిగింది. అంతకుముందు జరిగిన దుబ్బాక ఉపఎన్నికలో ఓటుకు రూ.3 వేల వరకు ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. ఇప్పుడు మునుగోడు ఉపఎన్నిక పార్టీలన్నింటికీ కీలకంగా మారడంతో భారీగా డబ్బులు పంచుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -