Roja: రోజాకు చుక్కలు చూపిస్తున్న వ్యతిరేక వర్గం.. అందుకే రాజీనామా చేయాలనుకుంటున్నారా?

Roja: చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో మరోసారి రాజకీయ వర్గ విభేదాలు హీటెక్కాయి. నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజా లేకుండానే వ్యతిరేక వర్గం రైతు భరోసా కేంద్రానికి భూమి పూజ చేశారు. ఈ విషయంపై మంత్రి రోజా ఫైర్ అయ్యారు. ప్రోటోకాల్స్ పాటించకుండా, తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా భూమిపూజ చేశారని మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరి నియోజకవర్గంలో తనను బలహీన పరిచేందుకు కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఓ ఆడియో మెసేజ్‌ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.

టీడీపీ, జనసేన పార్టీ వాళ్లు నవ్వుకునే విధంగా విపక్షవర్గం సపోర్ట్ చేస్తోంది. నగరి నియోజకవర్గంలో తనకు నష్టం కలిగించే విధంగా.. పార్టీని దిగజార్చే విధంగా విపక్షవర్గం కుట్ర చేసింది. ఇందులో భాగంగా కొప్పేడులో రైతు భరోసా కేంద్రానికి నేను లేకుండానే భూమి పూజ నిర్వహించారు. ఇది ఎంతవరకు కరెక్ట్?. మంత్రిగా, ఎమ్మెల్యేగా కొనసాగుతున్నా.. ఎలాంటి ప్రోటోకాల్ పాటించకుండా భూమిపూజ చేయడం సమంజసమేనా? ఈ విషయంపై అందరూ ఆలోచించాలి. ఇలాంటి వాళ్లు ఉన్నంత వరకూ రాజకీయాలు చేయడం కష్టం. కష్టపడి పార్టీ కోసం పని చేస్తుంటే.. రోజూ మెంటల్ టెన్షన్ పెడుతున్నారు. అన్నీ రకాలుగా నష్టం చేకూరుస్తున్నారు. ఇలాంటి వాళ్లు రాజకీయ నాయకులని చెప్పుకోవడం.. వారిని కొందరు ప్రోత్సాహించడం చాలా బాధేస్తోంది.’ అని మంత్రి రోజా ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా, నగరి నియోజకవర్గంలోని నిండ్ర మండలం కొప్పేడులో శ్రీశైలం బోర్డు చైర్మన్ రెడ్డి వారి చక్రపాణి రెడ్డి రైతు భరోసా కేంద్రానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఈడిగ కార్పొరేషన్ చైర్‌పర్సన్ కేజే.శాంతి హాజరయ్యారు. అయితే గత కొద్ది రోజులుగా నగరి నియోజకవర్గంలో వర్గ విభేదాలు తలెత్తుతున్నాయి. సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫెక్సీల విషయంలో వివాదం చోటు చేసుకుంది. ఆ ఫెక్సీలో రోజా ఫోటో లేకపోవడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అలాగే వైఎస్సార్ వర్ధంతి వేడుకలను రోజా వ్యతిరేక వర్గం నిర్వహించింది. దీంతో అప్పటి నుంచి రోజాకు వ్యతిరేక వర్గానికి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -