Actor Nandu: రష్మీ తన ఫోన్ ఎందుకు ఎత్తడం లేదంటూ హీరో నందు రచ్చ!!

Actor Nandu: తను ఎన్నిసార్లు ఫోన్ చేసినా కాల్ లిఫ్ట్ చేయడం లేదని, సినిమా ప్రమోషన్లకు పిలిచినా రావట్లేదని యాంకర్ రష్మీ గౌతమ్‌పై హీరో నందు మండిపడ్డాడు. యాంకర్ రష్మీ షూటింగ్ స్పాట్‌కు వెళ్లి నానా హంగామా చేశాడు. దీంతో రష్మీ కూడా హీరో నందుపై సీరియస్ అయింది. ‘నేను ఎక్కడికి రాను.. నాకు ఈ మెంటల్ ప్రెషర్ వద్దు. నాకు ఇష్టం లేదు’ అని చెప్పింది. అయితే వీరిద్దరూ నిజంగానే గొడవ పడ్డారని అనుకోకండి. సినిమా ప్రయోషన్‌లో భాగంగా వీరిద్దరు కలిసి ఓ ప్రాంక్ వీడియోను చేశారు. ఆ వీడియోలో ఉన్న స్క్రిప్ట్ డైలాగ్సే ఇవి.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హీరో నందు, హీరోయిన్ రష్మీ గౌతమ్ నటించిన చిత్రం ‘బొమ్మ బ్లాక్‌బస్టర్’. రాజ్ విరాట్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కుటుంబ కథాంశంతో తెరకెక్కింది. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని రెండేళ్లు గడిచింది. కానీ ఆయా కారణాల వల్ల సినిమా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. అయితే ఈ సినిమా ఉందనే విషయాన్ని ప్రేక్షకులు మరిచిపోయారు. ఈ క్రమంలో మేకర్స్ సినిమాపై హైప్ పెంచడానికి ప్రాంక్ వీడియోను క్రియేట్ చేశారు.

దాదాపు రెండేళ్ల విరామం తర్వాత బొమ్మ బ్లాక్‌బస్టర్ సినిమా విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. నవంబర్ 4వ తేదీన సినిమా విడుదల కానుంది. అందుకే సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర బృందం ప్రాంక్ వీడియోను ప్లాన్ చేసింది. అయితే గతంలో కూడా హీరో నందు ప్రాంక్ వీడియో చేశాడు. సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్‌లో భాగంగా నందు ప్రాంక్ వీడియో చేశాడు. అప్పుడు చాలా మంది బిగ్‌బాస్ షోలో కంటెస్టెంట్‌గా వెళ్తున్నట్లు సమాచారం వచ్చింది. కానీ ఊహించని విధంగా ‘బొమ్మ బ్లాక్‌బస్టర్’ సినిమా టైటిల్‌ గురించి రివీల్ చేశాడు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -