Renu Desai: నాకు పవన్ కళ్యాణ్ రూపాయి కూడా ఇవ్వలేదు: రేణుదేశాయ్

Renu Desai: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం ప్రెస్ మీట్‌లో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వైసీపీ నాయకులు తరచుగా పవన్ కళ్యాణ్‌కి మూడు పెళ్లిళ్లు అయ్యాయి అంటూ విమ‌ర్శ‌లు చేస్తున్న సంగతి అందరికి తెల్సిందే. ఆ విమర్శలపైన పవన్ కళ్యాణ్ మొట్ట మొదటిసారిగా స్పందిస్తూ ఘాటుగా విమర్శలు చేశాడు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘వైసీపీ నాయకులు నాకు మూడు పెళ్లిళ్లు అయ్యాయ‌ని బాధపడుతున్నారు. అంతలా బాధగా అనిపిస్తే వైసీపీ నాయకులు కూడా మూడు పెళ్లిళ్లు చేసుకోండి. ఎవరైనా వ‌ద్ద‌న్నారా? అవును నేను మూడు పెళ్లిళ్లు చేసుకున్నాను. కానీ ఎవ‌రికీ అన్యాయం చేయలేదు. నా మొదటి భార్య నందినితో విడిపోయిన‌ప్పుడు ఆమెకు రూ.5కోట్లు ఇచ్చాను. అలాగే రెండో భార్య రేణూ దేశాయ్‌తో విడిపోయిన‌ప్పుడు ఆస్తి ఇచ్చాను.’ అని ఆయన పేర్కొన్నాడు.

ఈ విషయంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. గతంలో రేణు దేశాయ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ తనకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పుకొచ్చింది. దీంతో ఆమె గ‌తంలో చెప్పిన మాట‌ల‌ను వెతికి మ‌రీ నెటిజన్లు ఇప్పుడు హైలెట్ చేస్తున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ అబద్ధపు మాటలు చెప్పాడా? అనే కోణంలో అనుమానాలు దారి తీస్తున్నాయి. వీరిద్దరిలో ఎవ‌రు నిజం చెప్పారో తెలియక నెటిజన్లు సతమతం అవుతున్నారు. నిజాన్ని తెలుసుకునేందు ప్రయత్నం చేస్తున్నారు.

అయితే ఒక‌వేళ ప‌వ‌న్ ఆస్తి ఇచ్చిన మాట‌లు నిజమైతే రేణు దేశాయ్ అబ్ద‌దం చెప్పిందా? లేక పవన్ కళ్యాణ్ అబ్ద‌దం చెప్తున్నాడా? అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక రేణు దేశాయ్ భరణం మీద ఎప్ప‌టి నుంచో మాట్లాడుతూనే ఉంది. ఇన్ని రోజులు రేణు దేశాయ్ మాటలకు పవన్ కళ్యాణ్ స్పందించలేదని అంటున్నారు. దీంతో ప్రస్తుతం ఆయన మాట్లాడిన మాటలు ఎన్నో ప్ర‌శ్న‌లకు తెర లేపింది. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -