RRR Movie: చరణ్, తారక్ రేంజ్ ఇదే.. జపాన్ లో ఆర్.ఆర్.ఆర్ కలెక్షన్లు ఎంతంటే?

RRR Movie:  సక్సెస్ ఫుల్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇందులో నటించి మెప్పించారు. ఈ చిత్రం మనదేశంలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రికార్డులు తిరగరాసింది. బాక్సీఫీసు వద్ద కలెక్షన్లతో హోరెత్తించింది. అయితే, ఇక్కడ రికార్డులు రాజమౌళికి కొత్తేమీ కాదు. ఇప్పుడు ఈ హీట్ జపాన్ ను తాకింది. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని జపాన్ లో భారీ ఎత్తున రిలీజ్ చేశారు చిత్ర బృందం.

ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా సినిమా టీమ్ అంతా టోక్యో వెళ్లారు. జపాన్ లో కూడా భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా జపాన్ లో తొలిరోజు రూ.1.06 కోట్లు వసూలు చేసినట్లు చెబుతున్నారు. అక్కడ అతిపెద్ద ఓపెనింగ్స్ రాబట్టిన తొలి భారతీయ చిత్రంగా ఆర్ఆర్ఆర్ నిలిచిందని సమాచారం.

జపనీయుల ఆదరణ అమోఘం..

జపనీయుల లెక్కల ప్రకారం ఆర్ఆర్ఆర్ చిత్రం మొదటి వారంలో జేపీవై73ఎం వసూలు చేసిందట. భారతీయ సినిమాల్లో అత్యంత ఎక్కువ మొదటి వారం కలెక్షన్ ఓపెనింగ్ చేసిపెట్టిందట. జపాన్ బాక్సాఫీస్ ఓపెనింగ్స్ లో ఈ సినిమా పదో స్థానంలో నిలిచిందట. అయితే, అక్కడ తొలి 9 స్థానాలు జపనీస్ యానిమేషన్ చిత్రాలు ఉన్నాయని సమాచారం. జపాన్ ప్రేక్షకులు ఇండియన్ సినిమాను బాగా ఆస్వాదిస్తున్నారట.

కొన్నేళ్లుగా భారతీయ చిత్రాలు జపాన్ లో రిలీజ్ చేస్తున్నారు. వాటిని జపనీయులు ఆదరిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలిని కూడా వారు బాగా ఆదరించారు. సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ముత్తు చిత్రం ఇప్పటికీ టాప్ లో ఉందట. ఆ చిత్రం అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో అగ్ర స్థానంలో కొనసాగుతోంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -