Ram Charan: చరణ్ సంజయ్ కాంబో మూవీ అలా ఉండబోతుందా?

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. అయితే కొంత కొంతకాలంగా ఈయన గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీల భన్సాలీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి అయితే ఈ వార్తలు గురించి ఎలాంటి క్లారిటీ లేకపోయినా ఈ విషయం గురించి తరచు వార్తలు వైరల్ అవుతున్నాయి.

 

ఇకపోతే తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో ఎలాంటి సినిమా ప్రేక్షకులు ముందుకు రాబోతుంది అనే విషయం గురించి మరొక వార్త వైరల్ గా మారింది. నిజానికి సంజయ్ లీల రామ్ చరణ్ కాంబినేషన్లో కోవిడ్ కంటే ముందుగానే సినిమా చేయాలని భావించారంటూ వార్తలు వస్తున్నాయి. ఇక రామ్ చరణ్ తోనే సంజయ్ లీలా భన్సాలీ సినిమా చేయాలనుకోవడానికి కారణమేంటి అనే విషయానికి వస్తే..

రామ్ చరణ్ నటించిన మగధీర సినిమా చూసే అతని నటనకు ఫిదా అయ్యాడట అందులో ఆయన హార్స్ రైడింగ్ కట్టి తిప్పడం వంటి సన్నివేశాలను చూసిన సంజయ్ లీల భన్సాలీ తనతో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారు అంటూ ఈ వార్త వైరల్ గా మారింది. 11వ శతాబ్దానికి చెందిన వీరాధివీరుడైన మహారాజు సుహీల్‌దేవ్‌ చరిత్ర ఆధారంగా అమిష్‌ త్రిపాఠి ఓ కథని రెడీ చేశారు. ఆ కథతోనే సంజయ్‌ సినిమా తీసేందుకు సిద్ధమవుతున్నాడు.

 

ఇండియాలోకి గజినీ చక్రవర్తుల ఆక్రమణ జరగకుండా సుహీల్‌ ఉన్నంతవరకు అడ్డుకున్నాడు. మహమ్మద్‌ ఆఫ్‌ గజినీని ఓడిరచాడు సుహీల్‌. ఇతర రాజుల సహాయంతో మహాకాల సైన్యం ఏర్పాటు చేసి గజినీలకు చుక్కలు చూపించిన వీరుడు సుహీల్‌ దేవ్‌ అయితే ఈయన చరిత్ర పెద్దగా బయటకు తెలియకుండా మరుగున పడిపోవడంతో ఇతని చరిత్రను అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశంతో సంజయ్ లీల సినిమా చేయాలని ఇలాంటి ఓ గొప్ప చక్రవర్తి పాత్రలో నటించే అర్హత చరన్ కి ఉందని ఈయన తనతో సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యారు అంటూ వార్తలు వస్తున్నాయి మరి ఇందులో ఎంతవరకు ఉందో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: ఓటమి భయంతో జగన్ కొత్త ఎత్తుగడలు వేస్తున్నారా.. ఈ ప్లాన్స్ కు అడ్డుకట్ట వేసేదెవరు?

YS Jagan: ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడే కొద్ది ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. సార్వ‌త్రిక ఎన్నిక‌ల వార్ వ‌న్‌సైడ్ గా మారింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూట‌మికి ప్ర‌జాద‌ర‌ణ పెరుగుతోంది. ఈ...
- Advertisement -
- Advertisement -