Klin Kaara: చరణ్ ఉపాసన క్లీంకారను ఏమని పిలుస్తారో మీకు తెలుసా?

Klin Kaara: టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఎంతో మంచి ఆదరణ ఉంది. మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈయన వారసుడిగా రాంచరణ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఇలా రామ్ చరణ్ హీరోగా ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తున్నారు.

 

ఈయనకు గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ మాత్రమే కాకుండా ఈయన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇలా వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి రామ్ చరణ్ ఇటీవల తండ్రిగా కూడా ప్రమోట్ అయ్యారు.

ఉపాసన రాంచరణ్ దంపతులు పెళ్లి చేసుకున్న పది సంవత్సరాలకు పిల్లలను ప్లాన్ చేశారు. ఈ దంపతులకు గత ఏడాది జూన్ నెలలో చిన్నారి క్లీన్ కారా జన్మించారు. ఈమె జన్మించి దాదాపు 8 నెలలు అవుతున్న ఇప్పటివరకు తను ఎలా ఉంటుంది ఏంటి అనేది మాత్రం అభిమానులకు చూపించలేదు.

 

ఇక ఈ చిన్నారికి లలిత సహస్రనామాలలో ఒకటైన క్లీన్ కారా అనే పేరుతో నామకరణం చేశారు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఉపాసన తన కుమార్తె గురించి పలు విషయాలు వెల్లడించారు తన ఇంట్లో క్లిన్ కారాను ముద్దుగా తాను కారా అని పిలుచుకుంటాను అంటూ ఉపాసన తెలిపారు. ఇలా ఉపాసన చేసిన ఈ మాటలను బట్టి చూస్తే క్లీన్ కారా ముద్దు పేరు కారా అని తెలిసి అభిమానులు ఈ పేరును మరింత వైరల్ చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: జగన్ మేనిఫెస్టో మోసాలు.. శవాల మీద పేలాలు ఏరుకునేలా రాజకీయాలు చేశారా?

CM Jagan:  జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో తనకు బైబిల్ ఖురాన్ భగవద్గీత లాంటిది అని చెబుతూ ఉంటారు అయితే ఎన్నికలలో భాగంగా మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఎన్నో పథకాలను అమలు పరచలేదు అయితే ఇలాంటి...
- Advertisement -
- Advertisement -