Samantha: సమంత అనారోగ్యం గురించి వెంకీ కూతురు అలా అన్నారా?

Samantha: హీరోయిన్ సమంత అరుదైన జబ్బు మయోసైటిస్ తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇది ప్రమాదకరమైన ఆటో ఇమ్యూన్ వ్యాధిగా వైద్యులు చెబుతున్నారు. రికవరీ శాతం ఎక్కువగా ఉండటం శుభసూచకమంటున్నారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి సమంతకు మనో ధైర్యాన్ని ఇస్తూ అభిమానులు, సెలెబ్రిటీలు వరుసగా మద్దతుగా నిలుస్తున్నారు.

సోసల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు. చిత్ర సీమకు వచ్చిన అనతి కాలంలోనే సమంత స్టార్ హీరోయిన్ అయ్యింది. ఇప్పుడు సమంత దక్షిణాదిలోలోనే తిరుగులేని స్టార్ హీరోయిన్ అనడంలో అతిశయోక్తి కాదేమో. జీవితంలో ఒడిదొడుకులు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొంటోంది సమంత. ప్రస్తుతం సమంతకు విధి అస్సలు సహకరించడం లేదు. విడాకులు, తర్వాత అనారోగ్య సమస్య ఇలా సతమతమవుతోంది.

ఇప్పటికే సమంత త్వరగా కోలుకోవాలని ఎన్టీఆర్, అఖిల్, సాయిధరమ్ తేజ్, సుశాంత్, కాజల్ అగర్వాల్, రాశి ఖన్నా తదితర సెలెబ్రిటీలు స్పందించారు. ట్వీట్ల ద్వారా సందేశం పంపుతున్నారు. ఇంకా సమంత కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్ట్ లు వస్తూనే ఉన్నాయి. అక్కినేని ఫ్యామిలీ నుంచి అఖిల్, సుశాంత్ స్పందించారు. మరోవైపు దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి కూడా పలువురు స్పందించారు.

విక్టరీ వెంకటేష్ కుమార్తె ఆశ్రిత దగ్గుబాటి సమంత ఆరోగ్యంగా త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేసింది. సమంత ఇన్ స్టాలో పెట్టిన పోస్ట్ కు ఆశ్రిత రిప్లై ఇచ్చింది. నీ గురించి నీకు తెలియదు సమంత.. నీలో నీకు తెలియనంత శక్తి దాగి ఉంది. అనంతమైన ప్రేమ నీకు పంపుతున్నా.. అంటూ ఆశ్రిత ఇన్ స్టాగ్రామ్ లో కామెంట్ పెట్టింది. ఆమెతో పాటు కమల్ హాసన్ చిన్న కుమార్తె అక్షర హాసన్, మంచు లక్ష్మి, రితేష్ దేశ్ ముఖ్, జెనీలియా.. ఇలా అనేక మంది సమంతకు బాసటగా నిలుస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -