Mahesh Babu-Trivikram: మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ ఆగిపోవడానికి కారణాలివే!

Mahesh Babu-Trivikram: ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులకు చేదువార్త. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌తో 28వ సినిమాకు బ్రేకులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాపై ఫిల్మ్ ఇండస్ట్రీలో వెరే లెవల్‌లో గాసిప్స్ వినిపిస్తున్నాయి. అసలు ఈ సినిమా సెట్స్ పైకి వస్తుందా?.. షూటింగ్ ప్రారంభమవుతుందా?.. మహేష్ బాబు స్టోరీని ఓకే చెప్తాడా..? అనే ప్రశ్నలు ఆసక్తిని రేపుతున్నాయి. దర్శకుడు త్రివిక్రమ్ సరైన స్క్రిప్ట్‌ తో హీరో మహేష్ బాబును ఒప్పించలేకపోయారని టాక్ వినిపిస్తోంది. అలాగే రకరకాల వదంతులు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ స్క్రిప్ట్‌ ను త్రివిక్రమ్ స్వయంగా తయారు చేయలేదని, ఓ టీమ్‌ను పెట్టుకుని వారికి పనులు అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది.

దీంతో స్క్రిప్ట్ పర్‌ఫెక్ట్ గా తయారు చేయమని, ఫస్ట్ షెడ్డ్యూల్‌ను అర్ధాంతరంగా ఆపేసి మహేష్ బాబు విదేశాలకు వెళ్లడం జరిగింది. అయితే స్క్రిప్ట్ రెడీ అయ్యాక వినిపించేందుకు త్రివిక్రమ్ లండన్ వెళ్లడానికి కూడా రెడీ అయినట్లు తెలుస్తోంది. కానీ మహేష్ బాబు వద్దని చెప్పి, మంచి స్క్రిప్ట్ తయారు చేయమని చెప్పారట. దీనికి మరింత సమయం తీసుకోమని చెప్పినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు ఇండియాకు తిరిగి వస్తున్నారు. అయితే త్రివిక్రమ్-మహేష్ కలిసి స్క్రిప్ట్ పై డిస్కషన్ చేస్తారో? లేదో? వేచి చూడాలి.

స్క్రిప్ట్ విషయంలో మహేష్ బాబు ఎంతో స్ట్రిక్ట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం బౌండ్ స్క్రిప్ట్ ఇస్తే తప్ప సెట్స్ పైకి వెళ్లడానికి ఇష్టపడటం లేదని సమాచారం. అవసరం అయితే ఈ సినిమాను ఆపేసి ప్రముఖ దర్శకుడు రాజమౌళి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి కూడా వెనకడుగు వేయడం లేదట. స్క్రిప్ట్ మంచిగా లేకపోతే.. ఈ సారి సినిమా చేసేదే లేదని మహేష్ బాబు భీష్మించుకుని కూర్చున్నట్లు తెలుస్తోంది. కాగా, త్రివిక్రమ్ ఈ మధ్య వేరే పనుల్లో బిజీగా ఉంటున్నారు.

తన భార్యను నిర్మాతగా పరిచయం చేయడంతో ఆ పనుల్లో ఫుల్ బిజీ అయిపోయారు. సినిమా కథలు, కాస్టింగ్, క్వాలిటీ చెక్ ఇలా ప్రతి విషయాలు త్రివిక్రమ్ మాత్రమే చూసుకోవాలి. అలాగే పవన్ కళ్యాణ్ సినిమా వ్యవహారాలు కూడా త్రివిక్రమే చూసుకుంటారు. ఈ క్రమంలో స్టోరీపై ఫోకస్ పెట్టనట్లు తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: జగన్ అధికారంలోకి వస్తే ఏపీ ప్రజల భూములు పోతాయా.. బాబు చెప్పిన విషయాలివే!

Chandrababu Naidu: జగన్ మరొకసారి అధికారంలోకి వస్తే ప్రజల భూములను అధికారికంగా కబ్జా చేస్తారని భయం ప్రజల్లో పట్టుకుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన భూ యాజమాన్య హక్కు చట్టం కబ్జాదారులకు అక్రమార్కులకు...
- Advertisement -
- Advertisement -