Trivikram: సినిమా ప్రకటించి వద్దన్న బన్నీ.. త్రివిక్రమ్ కు కష్టమేనా?

Trivikram: టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కాబోతోంది. ఇక ఈ ప్రాజెక్టు తర్వాత బన్నీ ఏ దర్శకుడితో సినిమా చేస్తాడనేదే సర్వత్రా ఆసక్తికరంగా మారింది. బన్నీ లైనప్ లో చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు. కానీ ఎవరితో సినిమా చేస్తాడనే విషయం పై మాత్రం క్లారిటీ లేదు. అయితే గత కొన్నాళ్లుగా బన్నీ డైరెక్టర్స్ విషయంలో మాట తప్పుతున్నాడని వాదనలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో బన్నీ డైరెక్టర్స్ విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలను గమనిస్తే ఇది నిజమే అనిపిస్తుంది.

ఇప్పటికే చాలామంది దర్శక నిర్మాతలతో సినిమా చేస్తానని చెప్పి మాట తప్పినట్లు స్పష్టం అవుతుంది. ఇక గత కొద్ది రోజులుగా త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కబోయే నాలుగో సినిమా ఆగిపోతుంది అనే వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో బన్నీ డైరెక్టర్స్ విషయంలో మాట తప్పుతున్నాడని అంటున్నారు. విచిత్రం ఏంటంటే, సదరరు దర్శకులతో బన్నీ కమిట్ అవుతున్న సినిమాలన్నీ అఫీషియల్ గా అనౌన్స్ అయిన తర్వాతే క్యాన్సిల్ చేయబడుతున్నాయి. 2017 లో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా కంటే ముందు అల్లు అర్జున్ కోలీవుడ్ డైరెక్టర్ లింగస్వామి తో సినిమా చేయాల్సి ఉంది.

 

ఈ ప్రాజెక్టుని కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ నిర్మిస్తుందని అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కానీ ఆ తర్వాత కొద్ది రోజులకి ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. తర్వాత బన్నీ వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ తో ఐకాన్ అనే ప్రాజెక్ట్ చేసేందుకు కమిట్ అయ్యాడు. అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అంతేకాదు ఈ సినిమా అనౌన్స్మెంట్ సందర్భంగా అల్లు అర్జున్ తన ట్యాగ్ స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్ గా మార్చుకున్నాడు. కట్ చేస్తే.. ఈ ప్రాజెక్టు కూడా ఆగిపోయింది. మరి పుష్ప తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో సినిమా చేస్తారా లేదంటే మాట తప్పుతారా చూడాలి మరి. త్రివిక్రమ్ సినిమా కాదు అంటే అల్లు అర్జున్ తో సినిమాలు చేయడానికి చాలామంది దర్శకులు వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. మరి వారిలో ఏ సినిమాను ఒకే చేస్తారో చూడాలి మరి..

Related Articles

ట్రేండింగ్

YS Sunitha: సెఫ్టిక్ అయితే ప్రాణాలకే ప్రమాదం జగన్.. సునీత పంచ్ లు మామూలుగా లేవుగా!

YS Sunitha: జగన్ కి జరిగిన రాయి దాడి నేపథ్యం లో ఆయన చెల్లెలు ఆయన సునీత ఆయనని ఒక ఆట ఆడుకుంటున్నారు. వైయస్ వివేక హత్య విషయంలో సునీత జగన్ మీద...
- Advertisement -
- Advertisement -